చైనా కొత్త చట్టం, భారత ఖడ్గమృగాల పీకలమీదకొచ్చింది

చైనా తన వైద్య పరిశోధనలో ఖడ్గమృగాల కొమ్ములు, పులి ఎముకల వాడాకాన్ని చట్టబద్దం చేసింది. ఇది భారత్‌లో వున్న ఖడ్గమృగాలు, పులుల సంఖ్యను ప్రభావితం చేసే అవకాశం వుందని భారత అధికారులు అందోళన చెందుతున్నారు.

Suresh Rachamalla | news18-telugu
Updated: November 3, 2018, 7:09 PM IST
చైనా కొత్త చట్టం, భారత ఖడ్గమృగాల పీకలమీదకొచ్చింది
ప్రతీకాత్మక చిత్రం
Suresh Rachamalla | news18-telugu
Updated: November 3, 2018, 7:09 PM IST
చైనా తన  సంప్రదాయ మందుల తయారీలో  జంతువుల అవయవాల వాడకాన్ని చట్టబద్దం చేసింది. ఇది పరోక్షంగా భారత్‌లో మనుగడసాగిస్తున్న జంతువుల పై  ప్రభావం చూపనుంది. చైనా నాటు మందుల్లో ఎక్కువగా ఖడ్గమృగాల కొమ్ములు, పులి ఎముకలు వాడుతారు.   ఇది భారత్‌లో అంతరించిపోతన్న ఖడ్గమృగాలు, పులుల  ఉనికిని, వాటీ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుందని భారత అధికారులు అంటున్నారు. అయితే చైనా మాత్రం చట్టవిరుద్ధంగా చంపిన లేదా సేకరించిన ఉత్పత్తులను ప్రోత్సహించమని ప్రకటించింది. వేటగాళ్లు సొంతంగా లేదా అనధికారంగా సేకరించిన ఉత్పత్తులను గుర్తించం అని హామి ఇస్తుంది. కాని అవేమీ భారత అధికారులకు సంతృప్తిని గాని, వారి సందేహాల్నిగానీ తీర్చడం లేదు.

చైనా నాటు మందుల్లో ఎక్కువగా ఖడ్గమృగాల కొమ్ములు వాడుతారు. ఇది భారత్‌లో అంతరించిపోతన్న ఖడ్గమృగాల ఉనికిని ప్రభావితం చేయనుంది.


దీనిపై మాజీ వైల్డ్ లైఫ్ DIG, ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ డైరెక్టర్, ప్రకృతి శ్రీవత్సవ మాట్లాడుతూ, ఇది అక్రమ రవాణాను ఖచ్చితంగా ప్రేరేపిస్తుందని, ముఖ్యంగా "కజిరంగా  పార్కు బయట ఉన్న ఖడ్గమృగాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని" అని ఆమె అన్నారు.

గత కొన్ని సంవత్సారాల నుండి, భారత ప్రభుత్వపు జంతు  రక్షణ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. తాజా సర్వే ప్రకారం,  2018 నాటికి, కజిరంగా జాతీయ పార్కులో ఖడ్గమృగాల సంఖ్య 2,413 కు పెరిగింది. ఈ పెరుగుదల వల్ల  కజిరంగా పార్కులో  ఎక్కడ చూసిన ఖడ్గమృగాలే కనిపిస్తున్నాయి.  ఈ పరిస్థితి ఖడ్గమృగాలను ఇంకా సులభంగా వేటాడడానికి అవకాశం కల్పిస్తుందని, దీనికి తగ్గ ఎర్పాట్లు ప్రభుత్వం చేయాలని ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ  కోరింది.

First published: November 3, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...