500 రోజుల పాటు జైల్లోనే గడిపిన ఆ విలేకరులు.. చివరికి..

ప్రభుత్వ రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో వారిని మయన్మార్ ప్రభుత్వం నిర్బంధించి జైలుకు పంపింది. మయన్మార్ కోర్టు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. దీనిపై ప్రపంచంలోని చాలా దేశాలు నిరసన వ్యక్తం చేశాయి.

news18-telugu
Updated: May 7, 2019, 12:42 PM IST
500 రోజుల పాటు జైల్లోనే గడిపిన ఆ విలేకరులు.. చివరికి..
రాయిటర్స్ జర్నలిస్టులు
  • Share this:
రోహింగ్యా ముస్లిం యువకులు, బాలల్ని భద్రతా దళాలు, బౌద్ధ మతానికి చెందిన వ్యక్తులు కలిసి చంపేసిన ఘటన మయన్మార్‌ చరిత్రలోనే అమానవీయమైనది. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను వా లోన్(33), క్యావ్ సో వూ(29) రాయిటర్స్ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేశారు. ప్రభుత్వ రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో వారిని మయన్మార్ ప్రభుత్వం నిర్బంధించి జైలుకు పంపింది. మయన్మార్ కోర్టు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. దీనిపై ప్రపంచంలోని చాలా దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే, 500 రోజుల అనంతరం ప్రపంచ దేశాల ఒత్తిడితో చివరికి ఆ ఇద్దరికి జైలు శిక్ష నుంచి ఆ దేశ అధ్యక్షుడు విన్ మైంట్ క్షమాభిక్ష పెట్టారు. వారు మంగళవారం విడుదల అయ్యారు.

అసలేం జరిగిందంటే.. ముస్లింలలో ప్రత్యేక తెగకు చెందిన రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్‌లో నివసిస్తున్నారు. కానీ, 1982లో మయన్మార్‌ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో 135 స్థానిక జాతులలో ఒకటిగా రోహింగ్యాలను గుర్తించలేదు. రోహింగ్యా బెంగాలీ పదమని, వారంతా బంగ్లాదేశ్‌ నుంచి తమ దేశానికి అక్రమంగా వలస వచ్చారని మయన్మార్‌ వాదించింది. హింసను భరించలేక రోహింగ్యాలు ప్రాణాలకు తెగించి మరీ వలస వెళ్లారు. సముద్రంలో నాటు పడవల్లో ప్రయాణిస్తూ బంగ్లాదేశ్‌తోపాటు థాయ్‌లాండ్‌, మలేషియా తదితర దేశాలకు చేరుకున్నారు. అంగ్‌సాన్‌ సూకీ పార్టీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వారిపై దాడులు మరింత పెరిగాయి. రోహింగ్యాల అణచివేత వార్తలు మీడియాలో రాకుండా ‘సెన్సార్‌’ మొదలైంది.
First published: May 7, 2019, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading