మాస్క్‌ వాడకాన్ని తప్పుబడుతున్న అమెరికన్ రెస్టారెంట్... వాటితో పోల్చిన వైనం

మాస్క్‌ వాడకాన్ని తప్పుబడుతున్న అమెరికన్ రెస్టారెంట్... వాటితో పోల్చిన వైనం

ప్రతీకాత్మక చిత్రం

Face Mask: తమ రెస్టారెంట్‌కు వచ్చేవారు ఫేస్ డైపర్లు ధరించాల్సిన అవసరం లేదని.. అందరికీ స్వాగతమని ఉన్న ఫోటోను ఆ సంస్థ రెస్టారెంట్ ముందు ఉంచడంతో పాటు.. ఫేస్‌బుక్‌లో కూడా షేర్‌ చేసింది

  • Share this:
కరోనా మహమ్మారిపై అమెరికన్లు ముందు నుంచి నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వారు ఏమాత్రం కృషి చేయట్లేదు. ప్రపంచంలోనే ఎక్కువ మరణాలు నమోదవుతున్నప్పటికీ అక్కడి ప్రజల వైఖరిలో మార్పు రావట్లేదు. తాజాగా ఫ్లోరిడాలోని ఒక రెస్టారెంట్ ఫేస్‌ మాస్క్‌ను అవమానిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. హెర్నాండో కౌంటీలో ఉన్న బెక్కి జాక్ ఫుడ్ షాక్ అనే రెస్టారెంట్ ఎంట్రన్స్ ముందు ఒక ఫోటో పెట్టింది. దాంట్లో ఫేస్ మాస్కులను డైపర్లతో పోల్చారు. 'మా రెస్టారెంట్‌కు వచ్చేవారు ఫేస్ డైపర్లు ధరించాల్సిన అవసరం లేదు. అందరికీ స్వాగతం' అని ఉన్న ఫోటోను ఆ సంస్థ రెస్టారెంట్ ముందు ఉంచడంతో పాటు.. ఫేస్‌బుక్‌లో కూడా షేర్‌ చేసింది. ఈ చర్యను ఆరోగ్య నిపుణులు ఖండిస్తున్నారు. తాము ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతోంటే.. ఇలా వ్యవహరించడం తగదని హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మాస్కు వాడకం అవసరం లేదు అంటూ షేర్ చేసిన ఈ ఫేస్‌బుక్‌ పోస్ట్‌కు రెస్టారెంట్ యజమాని స్వయంగా క్యాప్షన్ రాశారు. దీంట్లో ఫోటోకు ఒక ట్యాగ్ పెట్టారు. తమ రెస్టారెంట్‌కు వచ్చేవారు ఫేస్‌ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఆయన రాశారు. ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొన్ని వందలసార్లు షేర్ చేయడం విశేషం. దీనిపై కామెంట్స్ విభాగంలో చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది యూజర్లు ఈ ప్రకటనను స్వాగతిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇలాంటి పిచ్చి ప్రకటనలు మానుకోవాలని సూచిస్తున్నారు.

అయితే రెస్టారెంట్ యజమాని ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. తెలివి తక్కువ ప్రకటనలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని మరో వ్యక్తి రాశాడు. ఈ ప్రకటనతో రెస్టారెంట్‌కు వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని మరో యూజర్ కామెంట్ రాశాడు. ఈ ప్రకటనపై మిమర్శలు రావడంతో రెస్టారెంట్ యజమాని జెస్సీ ఫాక్స్ స్పందించారు. కరోనా జాగ్రత్త చర్యలకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. తమ ప్రకటనకు పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రెండూ వస్తున్నాయని చెప్పారు. కామన్ సెన్స్‌తోనే ఇలా చేస్తున్నానని తన ప్రకటనను సమర్థించుకున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:

అగ్ర కథనాలు