RESEARCHERS IN SWEDEN IDENTIFY GENE VARIANT THAT PROTECTS AGAINST COVID 19 DETAILS HERE MKS
gene variant: కొవిడ్ నుంచి రక్షించే కీలక జన్యువును గుర్తించిన సైంటిస్టులు
ప్రతీకాత్మక చిత్రం
కొవిడ్-19 ఇన్ఫెక్షన్ నుంచి రక్షించే నిర్దిష్ట జన్యు రూపాంతరాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఈ జన్యువును బట్టే మనం కొవిడ్‌కు తీవ్రంగా ప్రభావితం అవుతామా? లేక తేలికపాటి అనారోగ్యానికి గురవుతున్నామా అనేది ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
తీవ్రమైన కొవిడ్-19 ఇన్ఫెక్షన్ నుంచి రక్షించే నిర్దిష్ట జన్యు రూపాంతరాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఈ జన్యువును బట్టే మనం కొవిడ్‌కు తీవ్రంగా ప్రభావితం అవుతామా? లేక తేలికపాటి అనారోగ్యానికి గురవుతున్నామా అనేది ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో అంతర్జాతీయ సైంటిస్టుల బృందం నెలలపాటు జరిపిన జరిపిన పరిశోదనల్లో కొవిడ్ నుంచి కాపాడే జన్యువును గుర్తించారు. నిర్దిష్ట జన్యువులున్న డీఎన్ఏ కలిగిన వ్యక్తులకు కొవిడ్ సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయన రిపోర్టు ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’లో తాజాగా ప్రచురితం అయింది.
ఆఫ్రికన్ పూర్వీకుల మూలాలు, యూరోపియన్ పూర్వీకుల మూలాలున్న వేల మంది కొవిడ్ రోగులపై నిరంతరాయంగా జరిపిన పరిశోధనల్లో కొవిడ్ నుంచి రక్షించే జన్యువును గుర్తించారు. ఈ జన్యు రూపాంతరాన్ని గుర్తించడం వల్ల తీవ్రమైన కొవిడ్ సంక్రమణకు వ్యతిరేకంగా వైద్య చికిత్సను మరింత మెరుగుపర్చుకునే వీలుంటుందని సైంటిస్టులు చెప్పారు.
రక్షిత జన్యు వైవిధ్యం (rs10774671-G) OAS1 ఎన్కోడ్ చేయబడిన ప్రోటీన్ పొడవును నిర్ణయిస్తుందని, కొవిడ్-19కు కారణమయ్యే వైరస్ SARS-CoV-2ని విచ్ఛిన్నం చేయడంలో ప్రోటీన్ పొడవైన వైవిధ్యం ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో గుర్తించినట్లు సైంటిస్టులు తెలిపారు. ఆఫ్రికన్ వంశానికి చెందిన ఎనభై శాతం మంది వ్యక్తులు రక్షిత వేరియంట్‌ను కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
కొవిడ్ చికిత్సకు అవసరమైన కొత్త మందుల తయారీకి ఈ పరిశోధన ఎంతగానో మేలు చేస్తుందని అధ్యయనాన్ని రాసిన సహ రచయిత, కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బ్రెంట్ రిచర్డ్స్ చెప్పారు. కొవిడ్ రోగం ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజల్ని బలితీసకుంటోన్న విధానాన్ని బట్టి వారి డీఎన్ఏలో రక్షిత జన్యువు ఉందా, లేదా అనే విషయాన్ని కూడా నిర్దారించుకునే వీలున్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.