China Marathon tragedy: చైనాలో ప్రక‌ృతి ప్రకోపం.. 21 మంది రన్నర్లు మృతి

రెస్క్యూ ఆపరేషన్ (Image: China Xinhua News)

గాన్సు ప్రావిన్స్‌లో నిర్వహించిన మౌంటెయిన్ మారథాన్‌పై వడగాళ్లు, మంచు వర్షం విచుచుకుపడింది. భీకరమైన చలిగాలులు వీయడంతో మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు పిట్టల్లా రాలిపోయారు.

  • Share this:
    చైనాలో విషాదం నెలకొంది. ప్రకృతి ప్రకోపానికి 21 మంది రన్నర్లు బలయ్యారు. గాన్సు ప్రావిన్స్‌లో నిర్వహించిన మౌంటెయిన్ మారథాన్‌పై వడగాళ్లు, మంచు వర్షం విచుచుకుపడింది. భీకరమైన చలిగాలులు వీయడంతో మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు పిట్టల్లా రాలిపోయారు. మారథాన్‌లో మొత్తం 172 మంది పాల్గొనగా.. 151 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరో 21 మంది మరణించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించిది. ఆ పర్వత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముగిసినట్లు తెలిపింది. దీనిపై విచారణ జరుగుతోందని పేర్కొంది.

    బయిన్‌ నగరంలోని ఓ పర్వత ప్రాంతంలో 100 కి.మీ మారథాన్‌ నిర్వహించారు. ఈ ప్రదేశం యెల్లో నది తీర అటవీ ప్రాంతంలో ఉంది. రన్నర్లు ఎంతో ఉత్సాహంతో మారథాన్ ప్రారంభించారు. ఐతే రన్నర్లు 21 నుంచి 30 కి.మి. ప్రయాణించిన తర్వాత ప్రకృతి కన్నెర్ర చేసింది. మంచు తుఫాన్, చలిగాలుల దెబ్బకు రన్నర్లు వణికిపోయారు. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో వారిలో చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న నిర్వాహకులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐతే అక్కడికి వెళ్లే లోపే 21 మంది మరణించారు. మిగిలిన వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

    ఈ విషాదంపై బయిన్ నగర్ మేయర్ ఝాంగ్ షూచెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారథాన్ నిర్వాహుడిగా తాను క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలక ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తును ఊహించలేదని.. వాతావరణం ఒక్కసారిగా మారడం వల్లే రన్నరు మరణించారని వెల్లడించారు. గాన్సు ప్రావిన్స్ మంగోలియాకు సరిహద్దుగా ఉంటుంది. ఇక్కడ గతంలోనూ పలుమార్లు ప్రకృతి వైపరిత్యాలు సంభవించాయి. 2010లో బయిన్ నగరాన్ని ముంచెత్తాయి. అప్పుడు ఈ ఒక్క నగరంలోనే దాదాపు వెయ్యి మంది మరణించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: