టిక్ టాక్ యాప్‌తో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు చైనా కుట్ర

టిక్ టాక్ యాప్ ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటుదేమోనని.. ట్రంప్‌ను ఓడించేందుకు కుట్రలు జరగవచ్చని ఆ పార్టీకి చెందిన ఏడురుగు సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: July 31, 2020, 7:25 AM IST
టిక్ టాక్ యాప్‌తో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు చైనా కుట్ర
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాలో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. కరోనా సంక్షోభం, చైనాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఐతే అధ్యక్ష ఎన్నికలకు మూడు నెలల ముందు రిపబ్లికన్ పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. టిక్ టాక్ యాప్ ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటుదేమోనని.. ట్రంప్‌ను ఓడించేందుకు కుట్రలు జరగవచ్చని ఆ పార్టీకి చెందిన ఏడురుగు సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమగ్రత, భద్రత విఘాతం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జాక్‌ రాట్‌క్లిఫె, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌ క్రిష్టోఫర్‌ రే, హోంల్యాండ్‌ సెక్యూరిటీ తాత్కాలిక సెక్రటరీ చాంద్‌ వూల్ఫ్‌కు లేఖ రాశారు.

లేఖ రాసిన వారిలో సెనెటర్లు థామ్ టిల్లీస్, టామ్ కాటన్, కెవిన్ క్రామర్, టెడ్ క్రూజ్, జాని ఎర్రెస్ట్, మార్కో రుబియో, రిక్ స్కాట్ ఉన్నారు. అమెరికాలో కోట్లాది మంది టిక్ టాక్ వాడుతున్నారని.. ఆ యాప్ ద్వారా ట్రంప్‌కు వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం చేయవచ్చని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టిక్ టాక్‌‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చైనీస్ యాప్ టిక్ టాక్‌పై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


టిక్ టాక్‌పై అమెరికాలో ఇప్పటికే దుమారం రేగుతోంది. భారత్ మాదిరి ఇక్కడ కూడా బ్యాన్ చేయాలని అమెరికాి కాంగ్రెస్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. చైనా యాప్స్‌ని అస్సలు నమ్మలేమని.. ఆ యాప్స్ ద్వారా అమెరికాలో చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం చేస్తోందని విమర్శించారు. దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని అమెరికాలో టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ 25 మంది కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు ఇటీవలే లేఖ రాశారు. టిక్ టాక్‌ను బ్యాన్ చేయడం ద్వారా చైనా కమ్యూనిస్ట్ పార్టీ గూఢచర్యాన్ని అడ్డుకోవాలని తమ లేఖలో వారు కోరారు.

కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను జూన్‌లో భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే బాటలో వెళ్లాలని అమెరికా సైతం భావిస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 31, 2020, 7:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading