Republic Day 2021: ఈ ఏడాది రిపబ్లిక్ డేకు విదేశీ చీఫ్ గెస్ట్‌లు లేనట్టే

భారత ప్రభుత్వం వాస్తవానికి ఈ ఏడాది రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌గా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించింది. అయితే, యూకేలో కొత్త రకం కరోనా వైరస్ కారణంగా ఆయన కూడా ఈ సారి రావడం కుదరలేదు.

news18-telugu
Updated: January 14, 2021, 9:11 PM IST
Republic Day 2021: ఈ ఏడాది రిపబ్లిక్ డేకు విదేశీ చీఫ్ గెస్ట్‌లు లేనట్టే
రిపబ్లిక్ డే పరేడ్ (ప్రతీకాత్మక చిత్రం )
  • Share this:
భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకలకు విదేశాల నుంచి ముఖ్య అతిథులు ఎవరూ రావడం లేదు. ‘కరోనా వైరస్ కారణంగా విదేశాధినేతలు కానీ, విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఈ సంవత్సరం ముఖ్యఅతిథులుగా ఉండరు.’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. భారత ప్రభుత్వం వాస్తవానికి ఈ ఏడాది రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌గా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించింది. అయితే, యూకేలో కొత్త రకం కరోనా వైరస్ కారణంగా ఆయన కూడా ఈ సారి రావడం కుదరలేదు. మరో ముఖ్య అతిథి వస్తారని ప్రచారం జరిగింది. ఆయన రిపబ్లిక్ ఆఫ్ సర్‌నేమ్ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోకి. భారత మూలాలున్న ఆయన ఈసారి జనవరి 26న న్యూ ఢిల్లీలో జరగబోయే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్టు తొలుత ప్రచారం జరిగింది.  ఇంతకు ముందు ఆయన ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత విదేశాంగ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. దీంతో ఆయన రాక ఖాయమనే భావన వచ్చింది. అయితే, ఈసారి ఎవరూ విదేశీ చీఫ్ గెస్ట్‌లు లేరని విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. జనవరి 26వ తేదీన ట్రాక్టర్ల ర్యాలీ చేయాలని నిర్ణయించారు. రిపబ్లిక్ డే పరేడ్ జరిగే సమయంలోనే వారు కూడా ర్యాలీ చేయనున్నారు. కానీ, తాము పరేడ్‌కు ఎలాంటి ఆటంకం కలిగించబోమని రైతులు స్పష్టం చేశారు. తమ పని తాము చేసుకుంటామని, తమ ర్యాలీ తాము చేస్తామని ప్రకటించారు. ఎర్రకోట వద్ద కాకుండా, ఢిల్లీ-హర్యానా సరిహద్దులో నిర్వహించబోయే ట్రాక్టర్ల ర్యాలీకే రైతు సంఘాలు భారీగా ప్లాన్ చేశాయి. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు రైతులంతా తమ ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. రైతు చట్టాలకు తామంతా వ్యతిరేకమని మళ్ళీ కేంద్రానికి చాటి చెప్పాలని కోరింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 14, 2021, 9:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading