హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అబ్బో ఈమెది మామూలు బుర్ర కాదయ్యో..! చిన్న ట్రాకర్‌తో బాయ్‌ఫ్రెండ్‌నే మర్డర్ చేసింది.. యాపిల్ యూజర్స్ జర జాగ్రత..!

అబ్బో ఈమెది మామూలు బుర్ర కాదయ్యో..! చిన్న ట్రాకర్‌తో బాయ్‌ఫ్రెండ్‌నే మర్డర్ చేసింది.. యాపిల్ యూజర్స్ జర జాగ్రత..!

ఎయిర్ ట్యాగ్‌తో లొకేషన్ కనుక్కొని బాయ్‌ఫ్రెండ్‌ని చంపేసింది.

ఎయిర్ ట్యాగ్‌తో లొకేషన్ కనుక్కొని బాయ్‌ఫ్రెండ్‌ని చంపేసింది.

ఎయిర్‌ట్యాగ్‌(AirTag)లు లొకేషన్ మ్యా(Map)ప్‌ ను చూపించడం ద్వారా లేదా సౌండ్ ప్లే చేయడం ద్వారా పోగొట్టుకున్న వస్తువును కనుక్కోవడంలో సహాయపడతాయి. అయితే ఓ యూఎస్‌ (US) మహిళ ఎయిర్‌ట్యాగ్‌ను ఉపయోగించి.. ప్రియుడు (Lover) ఉన్న చోటును తెలుసుకుని హత్యకు పాల్పడింది.

ఇంకా చదవండి ...

Air Tagలు లొకేషన్ మ్యాప్‌ను చూపించడం ద్వారా లేదా సౌండ్ ప్లే చేయడం ద్వారా పోగొట్టుకున్న వస్తువును కనుక్కోవడంలో సహాయపడతాయి. అయితే ఓ యూఎస్‌ మహిళ ఎయిర్‌ట్యాగ్‌ను ఉపయోగించి.. ప్రియుడు ఉన్న చోటును తెలుసుకుని హత్యకు పాల్పడింది. వస్తువులను మరచిపోకుండా, పోగొట్టుకోకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ఎయిర్‌ట్యాగ్‌లను ఇలా హత్యలు చేసేందుకు ఉపయోగించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎయిర్‌ట్యాగ్‌ ఎలా పని చేస్తుంది?

కోట్ బటన్ సైజ్‌లో ఉండే ఎయిర్‌ట్యాగ్‌ను గతేడాది ఏప్రిల్‌లో Apple కంపెనీ లాంచ్‌ చేసింది. ఇది బ్లూటూత్ ట్రాకింగ్ పరికరం. కీస్‌, బ్యాక్‌ప్యాక్‌లు, వాలెట్‌లు, ఇతర పరికరాలు లేదా ఏదైనా వ్యక్తిగత వస్తువులను ట్రాక్ చేసి కనుక్కొనేలా వీటిని రూపొందించారు. యాపిల్‌ క్రౌడ్‌సోర్స్‌డ్ ఫైండ్ మై నెట్‌వర్క్‌ని ఉపయోగించి వస్తువులను ట్రాక్ చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా బ్యాగ్‌లో ఎయిర్‌ట్యాగ్‌ను ఉంచితే.. ఫోన్‌లోని ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ ద్వారా ఎయిర్‌ట్యాగ్‌ను ట్రాక్‌ చేసి బ్యాగ్‌ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ ఎయిర్‌ట్యాగ్‌లు వినియోగంలో ఉన్నాయి. వీటికి iOS 14.5, iPad iOS 14.5 లేదా అప్‌డేట్‌ వెర్షన్‌ అవసరం.

ఇదీ చదవండి:  నాన్నతో నీ ప్రయాణం.. ఒక్కరోజు ఆయనతో ఇలా ఉండండీ..!


బార్‌ బయట కారుతో ఢీకొట్టి హత్య..

USA లోని ఓ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ఒక మహిళ తన ప్రియుడి ఎయిర్‌ట్యాగ్‌ను ట్రాక్ చేసి, మరొక మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని, తనని మోసం చేశాడని భావించి హత్య చేసినట్లు పేర్కొంది. యూఎస్‌ఏ టుడే నివేదికలో పేర్కొన్న వివరాల మేరకు.. హంతకురాలు ఇండియానా రాష్ట్రంలో నివసిస్తోంది, ఆమె తన ప్రియుడు మోసం చేసినట్లు అనుమానించి, అతన్ని ట్రాక్ చేయడానికి ఎయిర్‌ట్యాగ్‌ని ఉపయోగించింది.

ఇదీ చదవండి: రష్యాలానే చైనా కూడా యుద్ధానికి సిద్ధమైందా..? చైనా ప్రత్యర్థి ఎవరంటే..?


బార్‌లో మరో మహిళను కలుసుకున్న తన ప్రియుడిని ట్రాక్ చేయడానికి ఎయిర్‌ట్యాగ్‌ను ఉపయోగించినట్లు హత్య చేసిన మహిళ పోలీసు నివేదికలో అంగీకరించింది. అతనిని మరొక స్త్రీతో చూశానని, కోపంతో అతనని నిలదీశానని, ఇద్దరికీ వాగ్వాదం జరగడంతో బార్‌ నుంచి బయటకు పంపారని, బయటకు వచ్చిన తర్వాత కార్‌తో ఢీకొట్టి ప్రియుడిని హతమార్చానని ఆమె వివరించింది.

ఎయిర్‌ట్యాగ్‌ల దుర్వినియోగం

ఎయిర్‌ట్యాగ్‌ను ఈ రీతిలో ఉపయోగించి, హత్య చేయడంపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీస్‌, బ్యాగ్‌, వాలెట్‌ ఇతర వస్తువులు ఎక్కడున్నాయో తెలుసుకునే ఉద్దేశంతో కంపెనీ ఎయిర్‌ట్యాగ్‌లను తయారు చేసింది. అయితే ఇలాంటి సంఘటనలు ఈ పరికరాన్ని నిఘా కోసం ఉపయోగించే వ్యక్తులకు, వారి బాధితులను వేటాడేవారికి ఆయుధంగా మారాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎయిర్‌ట్యాగ్‌కు సంబంధించి బహిరంగంగా వచ్చిన మొదటి ప్రధాన సమస్య ఇది ​​కాదు. ఐఫోన్ వినియోగదారులు వాటిని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి యాపిల్‌ ఎయిర్‌ట్యాగ్స్‌ కోసం iOS ద్వారా యాంటీ-ట్రాకింగ్ ఫీచర్‌లను ప్రవేశపెట్టవలసి వచ్చింది. స్పష్టంగా, ఆ చర్యలు పని చేయడం లేదు. ఈ కొత్త నివేదిక సూచించినట్లుగా, Apple సమస్యను పరిష్కరించడానికి ఇతర సంస్థలపై ఆధారపడవలసి వస్తుంది. అటువంటి సంఘటనలను అదుపులో ఉంచగల నిబంధనలను తీసుకురావడానికి లీగల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను కూడా ఉపయోగించవచ్చు.

First published:

Tags: Apple, Ios, USA

ఉత్తమ కథలు