Home /News /international /

REPORTS SAID PUTINS GUARDS CARRY SPECIAL SUITCASE TO COLLECT HIS POOP URINE ON FOREIGN TRIPS CARRY THEM HOME UMG GH

Vladimir Putin: పుతిన్ మలమూత్రాలను సేకరించేందుకు స్పెషల్‌ బాడీగార్డు.. చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్ ఫోటో)

రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్ ఫోటో)

పుతిన్ రష్యా దాటి బయట అడుగుపెడితే చాలు అతని మలమూత్రాలు (Poop And Pee) ఒక బాడీగార్డ్ సూట్‌కేసులో భద్రపరుస్తారట. తర్వాత ఆ విసర్జకాలను మాస్కో తీసుకొచ్చి మరీ పడేస్తారట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమని తాజాగా ఒక రిపోర్ట్ పేర్కొంది.

ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వంద రోజులకు పైగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ ఆరోగ్యం (Health)పై చాలా ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఇంకొన్ని సంవత్సరాలే బతుకుతారని కొన్ని సంచలన కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే రష్యన్ అధికారులు ఈ కథనాల్లో వాస్తవం లేదని చెబుతున్న నేపథ్యంలోనే పుతిన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పుతిన్ రష్యా దాటి బయట అడుగుపెడితే చాలు అతని మలమూత్రాలు (Poop And Pee) ఒక బాడీగార్డ్ సూట్‌కేసులో భద్రపరుస్తారట. తర్వాత ఆ విసర్జకాలను మాస్కో తీసుకొచ్చి మరీ పడేస్తారట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమని తాజాగా ఒక రిపోర్ట్ పేర్కొంది.

తన ఆరోగ్యం గురించి తెలియజేసే మలమూత్రాలు ఇతర వ్యక్తుల చేతుల్లో పడకూడదనే ఉద్దేశంతో పుతిన్ వాటిని కూడా కాపాడుకుంటారని ఫ్రెంచ్ న్యూస్ మ్యాగజైన్ ప్యారిస్ మ్యాచ్ (Paris Match) రిపోర్ట్ తెలిపింది. పుతిన్ మాస్కో బయట ఎక్కడ పర్యటించినా అతని అంగరక్షకులు మలమూత్రాలను లేదా మలం సేకరిస్తారని తాజా నివేదిక పేర్కొంది. ఎందుకంటే శారీరక వ్యర్థాలు దొరికితే తన ఆరోగ్య రహస్యాలపై విదేశీ గూఢచారులు గూఢచర్యాని (espionage)కి పాల్పడతారనే భయంతో పుతిన్ జాగ్రత్తపడుతున్నారని నివేదిక వివరించింది. నివేదికల ప్రకారం, ఫెడరల్ గార్డ్ సర్వీస్‌కు చెందిన ఓ ప్రత్యేక అధికారి పుతిన్ మలమూత్రాలను ప్రత్యేక ప్యాకెట్లలో సేకరించి, వాటిని సూట్‌కేస్‌లో ఉంచి, ఆ సూట్‌కేస్‌ను మాస్కోకు తిరిగి తెస్తారు.



"తన ఆరోగ్యం గురించి ఏదైనా సమాచారం విదేశీ ఇంటెలిజెన్స్ అధికారుల చేతికి చిక్కే అవకాశం ఉందని పుతిన్ భయపడుతున్నారు" అని డాక్ట్రిన్ & స్ట్రాటజీ కన్సల్టింగ్ ప్రెసిడెంట్, మాజీ డీఐఏ (DIA) ఇంటెలిజెన్స్ అధికారి రెబెకా కోఫ్లర్ ఫాక్స్ న్యూస్ డిజిటల్‌తో అన్నారు. "రష్యాను నిరవధికంగా తానే పాలిస్తాను అనే ఇమేజ్‌ను పుతిన్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు" అని రెబెకా కోఫ్లర్ పేర్కొన్నారు. పుతిన్‌కి ప్రాణాంతకమైన అనారోగ్యం ఉందన్న ఊహాగానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అతని ఆరోగ్యం గురించిన వివరాలు స్పష్టంగా ఎవరికీ తెలియవు. పుతిన్ కనీసం 2024 నాటికి, బహుశా 2036 నాటికి రష్యా అధ్యక్షుడిగా ఉండవచ్చు. ఉక్రెయిన్ దాడి తర్వాత అతని పాపులారిటీ భారీగా పెరగడమే ఇందుకు కారణం." అని అని కోఫ్లర్ చెప్పారు.

అక్కడ సీఎం బటన్ నొక్కడం ఆలస్యం.. ఇక్కడ సచివాలయానికి తాళాలేసిన రైతులు.. 


పుతిన్ మలమూత్రాలను సేకరించే విధానం కొత్తదేమీ కాదని మరికొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. మే 29, 2017న పుతిన్ ఫ్రాన్స్ పర్యటన చేస్తున్నప్పుడు ఇలాంటి వార్తలే వెల్లువెత్తాయి. అక్టోబర్ 2019 సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా కూడా కొన్ని వీడియోలతో సహా ఈ తరహా వార్తలు వచ్చాయి. పుతిన్ అధ్యక్షుడైన సమయం నుంచి ఈ పద్ధతిని కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే పుతిన్ అనారోగ్యం గురించి వివిధ నివేదికలు సెన్సేషనల్ రూమర్స్ ప్రచురిస్తున్నాయి. పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉందని, కంటి సమస్యలు, మానసిక అనారోగ్యంతో పుతిన్ బాధపడుతున్నారని కొద్ది రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ వార్తలను ఖండించారు. "అధ్యక్షుడు పుతిన్ ప్రతిరోజూ బహిరంగంగా కనిపిస్తారు. మీరు అతన్ని టీవీల్లో చూడవచ్చు, అతని ప్రసంగాలను చదవవచ్చు, అతని ప్రసంగాలను వినవచ్చు. ఇవన్నీ చూసే వారు పుతిన్‌లో ఏ విధమైన వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనుకోరు." అని లావ్రోవ్ చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు