చూడటానికి ఒరిజినల్‌లానే ఉన్నా.. సరిగ్గా పనిచేసే సమయానికి తుస్సుమంటే.. వెంటనే మన నోటి నుంచి మాట ఓర్నీ ఇది చైనాది రా. సరిగ్గా ఇలానే అయింది పాకిస్థాన్ పరిస్థితి. సముద్రంలో ఉన్న నౌకలకు రక్షణ కోసం పాకిస్థాన్ చైనాను సంప్రదించింది. అంతా ఓకే.. మొత్తం బిగించేశారు.. తీరా ఓసారి టెస్ట్ చేద్దామని చూస్తే ఇప్పుడవి వర్కవుట్ కావడం లేదు. దాంతో పాకిస్థాన్ అధికారులు చేసేదేమీ లేక లబోదిబోమంటున్నారంట.
పాకిస్థాన్ నౌకాదళ అధికారులకు నాలుగు చైనా ఫ్రిగేట్స్ పీడకలలను మిగిలుస్తున్నాయి. 2009 జూలైలో ప్రారంభించిన F-22P నాలుగు ఫ్రిగేట్స్‌లో మూడు చైనా షిప్ బిల్డింగ్ ట్రేడిండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినవేనని సమాచారం. మరోవైపు చైనాతో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్ కింద కరాచీ షిప్‌యార్డ్, ఇంజినీరింగ్ వర్క్స్‌లో మరో ఫ్రిగేట్ తయారీ పాకిస్థాన్ ఒప్పందం కుదుర్చుకుంది. 2005లో F-22P లేదా జుల్ఫికర్-క్లాస్ 2 ఫ్రిగేట్స్ రూపకల్పన, నిర్మాణం కోసం చైనాతో 750 మిలియన్ డాలర్‌ల విలువైన ఒప్పందంపై పాకిస్థాన్ సంతకం చేసింది. అయితే ఇవన్నీ విఫలమవుతుండటంతో ఇప్పుడు ఏం చేయాలో పాకిస్థాన్‌కు అర్థం కావడం లేదు.
ఫ్రిగేట్స్ అంటే ఏంటి?
గాలి, ఉపరితలం, నీటి అడుగున ముప్పుల నుంచి పెద్ద నౌకలను రక్షించడానికి ఫ్రిగేట్‌లను నౌకాదళాలు ఉపయోగిస్తాయి. పెద్ద నౌకలను ఎస్కార్ట్ చేయడం, రక్షించడంలో అడ్వాన్స్‌డ్ వెపన్స్, రక్షణ వ్యవస్థలతో ఉండే ఫ్రిగేట్స్ చాలా కీలకం. యాంటీ సబ్‌మెరైన్ మోడ్‌లో, అలాగే స్వల్పశ్రేణి వాయు రక్షణ కోసం యుద్ధ నౌకలను కొన్ని నౌకాదళాలు ఉపయోగిస్తాయి.
చైనీస్-మేడ్ ఫ్రిగేట్‌లతో పాకిస్థాన్ సమస్య ఏంటి?
సముద్రంలో పనిచేసే నౌకలకు వాయు రక్షణను పెంచడానికి ఫ్రిగేట్స్‌ను పాకిస్థాన్ కొనుగోలు చేసింది. కామర్స్ రైడింగ్, పెట్రోలింగ్, హెలిబోర్న్ కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా పాకిస్థాన్ ఫ్రిగేట్స్ ఉపయోగిస్తోంది. మిస్సైల్స్ అమర్చి ఉన్న ఫ్రిగేట్‌లకు ఏ విధమైన ముప్పులనైనా ఎదుర్కొనే శక్తి వీటికి ఉంది. అయితే పాకిస్థాన్ నేవీని నిరాశపరిచే విధంగా, FM90(N) మిసైల్ సిస్టమ్ ఆన్‌బోర్డ్ ఇమేజింగ్ పరికరంలో లోపాలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. సిస్టమ్ లక్ష్యాన్ని లాక్ చేయడంలో విఫలం అవుతున్నట్లు అక్కడ అధికారులు చెబుతున్నారు.
నౌకలో డిఫెక్టివ్ ఇన్‌ఫ్రా-రెడ్ సెన్సార్ (IR17) సిస్టమ్, ఎయిర్, సర్ఫేస్ సెర్చ్ కోసం SR 60 రేడార్ ఉపయోగిస్తారు. సెర్చ్, ట్రాక్ రాడార్లు హై ఎనర్జీ ప్రసారాల సమయంలో సక్రమంగా పని చేయకపోవడంతో ఆపరేషనల్ యుటిలిటీపై ఈ ప్రభావం పడుతుంది. ఫ్రిగేట్‌లలోని ప్రధాన డీజిల్‌తో నడిచే ఇంజిన్‌లలో కూడా లోపాలు ఉన్నట్లు సమాచారం. షిప్పింగ్ కంపెనీ అధిపతి వద్ద ఈ సమస్యపై పాకిస్థాన్ నావికాదళ వైస్ చీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆపరేషనల్ టైమ్ కోల్పోయినందుకు పాకిస్థాన్ నావికాదళం రెండో కమాండ్ పరిహారం కోరింది.
లోపాలతో ఉన్న షిప్‌లు?
PNS అస్లాత్
పేలవమైన రాడార్ పనితీరు
సక్రమంగా పనిచేయని ASO-94 సోనార్ సిస్టమ్
SR-47 BG సెర్చ్ రాడార్ పనితీరు తక్కువ
PNS జుల్ఫికర్
తప్పుడు కాంట్యాక్ట్స్‌ను తీసుకుంటున్న ASO-94 సోనార్
గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో కార్యాచరణ విస్తరణ సమయంలో తీవ్రమైన స్నాగ్
ఫ్రిగేట్ పోర్ట్ రబ్బరు బ్లేడ్ తొలగింపు
PNS సైఫ్
సమస్యాత్మక HP5 స్టెబిలైజర్ గైరో
గింబాల్ అసెంబ్లీ మోటార్లు లోపభూయిష్టంగా ఉండటంతో లోపం
మోటార్లు బాగు చేయడం లేదా మార్చాల్సిన అవసరం
కేవలం ఫ్రిగేట్‌లతో మాత్రమే సమస్య కాదు?
చైనీస్ నిర్మిత రక్షణ పరికరాల నాణ్యతపై అసంతృప్తిగా పాకిస్థాన్ నేవీ ఒక్కటే కాదు.. చైనా నుంచి దిగుమతి చేసుకున్న VT 4 ప్రధాన యుద్ధ ట్యాంకులలో నాణ్యత, విశ్వసనీయత సమస్యలను పాకిస్థాన్ సైన్యం కూడా ఎదుర్కొంటోంది. ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ సమయంలో, ట్యాంక్ అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ సమయంలోనే అధిక కార్యకలాపాలు, నిర్వహణ వ్యయం కారణంగా PAFకి JF-17 థండర్ భారంగా మారింది. వీటన్నింటితో పాకిస్థాన్ తల పట్టుకుని కూర్చుంది.
చైనా లోపాలున్న మిలిటరీ పరికరాలను ఎగుమతి చేస్తుందా?
పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాలకూ చైనా నుంచి పొందిన ఆయుధాలతో సమస్యలు ఉన్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో చైనా నుంచి కొనుగోలు చేసిన 6 CH-4B UCAVని రాయల్ జోర్డానియన్ ఎయిర్ ఫోర్స్ విక్రయించాలని నిర్ణయించింది. చైనీస్ CH-4B UCAV డ్రోన్‌లకు సంబంధించిన అనేక ప్రమాదాలను అల్జీరియా ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. లోపాలున్న 23 నాన్‌చాంగ్ పిటి-6 బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను బంగ్లాదేశ్ వైమానిక దళం పొందినట్లు నివేదిక. బంగ్లాదేశ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా 1970ల నాటి రెండు మింగ్ క్లాస్ టైప్ 035G జలాంతర్గాములు ఇప్పటికీ నిరుపయోగంగా పడి ఉన్నాయి.
బంగ్లాదేశ్ 2017లో ఒక్కో జలాంతర్గామి కోసం 100 మిలియన్ డాలర్‌లు చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2020లో రెండు చైనీస్ 053H3 ఫ్రిగేట్‌లను ఢాకా అందుకుంది. వాటిలో నాన్-ఫంక్షన్ నావిగేషన్ రేడార్, గన్ సిస్టమ్ వంటి సమస్యలు ఎదురైనట్లు సమాచారం. 2016లో చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చాంగ్‌కింగ్ టైమా ఇండస్ట్రీస్ తయారు చేసిన VN-4 ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్‌లను కెన్యా కొనుగోలు చేసింది. అయితే టెస్ట్ ఫైరింగ్ సమయంలో వాహనాల లోపల కూర్చోవడానికి చైనా సేల్స్ ప్రతినిధి స్వయంగా నిరాకరించినట్లు సమాచారం. తమకు పంపిన చైనా పరికరాల నాణ్యతపై మయన్మార్ సాయుధ దళాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. చైనీస్ పరికరాల నాణ్యతతో విస్తుపోయి, తర్వాత మేడ్ ఇన్ ఇండియా సబ్‌మెరైన్ సింధువీర్‌ను ఎంచుకున్న మయన్మార్
చైనీస్ ఆయుధాల నాణ్యత తక్కువగా ఉందా?
అమెరికా, రష్యా వంటి ఇతర ప్రధాన ఆయుధాల సరఫరాదారులను అందుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అమెరికన్, రష్యా వలె ఆయుధాలను చైనా పరీక్షించలేదని నిపుణులు అంటున్నారు. చైనా-నిర్మిత ఆయుధాలు సాంకేతికంగా మాత్రమే తక్కువ కాదని, యూఎస్, దాని మిత్రదేశాలు, అలాగే రష్యా మాదిరిగా యుద్ధభూమిలో ఆయుధాలను పరీక్షించదని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్, ప్రొఫెసర్ అలెగ్జాండర్ వువింగ్ తెలిపారు. చైనా సైనిక పరికరాలను ఎక్కువగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. చైనీస్ ఆయుధాలను కొనుగోలు చేయాలనే నిర్ణయం ప్రధానంగా తక్కువ ధర, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఉంటుందన్న నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, China, International news, Pakistan