Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

రష్యాలానే చైనా కూడా యుద్ధానికి సిద్ధమైందా..? చైనా ప్రత్యర్థి ఎవరంటే..?

రష్యాలానే చైనా కూడా యుద్ధానికి సిద్ధమైందా..? చైనా ప్రత్యర్థి ఎవరంటే..?

తైవాన్‌పై చైనా యుద్ధం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తైవాన్‌పై చైనా యుద్ధం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సరిహద్దు వివాదాలు ఎంత భయానకంగా మారుతాయో.. రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) యుద్ధమే (War) ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు రష్యా మాదిరిగానే చైనా కూడా తన సరిహద్దు దేశమైన తైవాన్‌ (Taiwan)తో కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

సరిహద్దు వివాదాలు ఎంత భయానకంగా మారుతాయో.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే ప్రత్యక్ష ఉదాహరణ. నెలల తరబడి జరుగుతున్న ఈ భీకర యుద్ధంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. ప్రతీ దేశానికీ తన పొరుగు దేశంతో కచ్చితంగా సరిహద్దు గొడవలు ఉంటాయి. అవి చేయి దాటితే ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా పడే ప్రమాదముంది. ఇప్పుడు రష్యా మాదిరిగానే చైనా కూడా తన సరిహద్దు దేశమైన తైవాన్‌తో కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత చైనా తన పూర్తి సహకారాన్ని రష్యాకు ప్రకటించింది. రష్యాతో తమ సత్సంబంధాలు ఎప్పటికీ అలానే ఉంటాయని.. సార్వభౌమాధికారం, భద్రత సమస్యలపై మాస్కోకు తమ దేశం సపోర్ట్‌గా ఉంటుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సరైన పరిష్కారం కోసం అన్ని పార్టీలు బాధ్యత తీసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జిన్‌పింగ్ ఫోన్‌లో కూడా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి:  వెరీ ఇంట్రెస్టింగ్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు స్పెషల్ పెన్ను.. అసలు దీని కథేంటంటే..!


ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రచ్ఛన్న యుద్ధానంతర స్థితిని మారుస్తోందని, ఆసియా ఇప్పటికే దాని ప్రభావాన్ని అనుభవిస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి. రష్యా చర్యలను దండయాత్రగా పిలవడానికి చైనా నిరాకరించింది. అంతేకాకుండా సంక్షోభాన్ని ప్రేరేపించినందుకు యూఎస్‌, దాని మిత్రదేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు చేసింది. అయితే, ప్రపంచ పెద్దన్న రష్యాతో చైనా పొత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. పుతిన్ వైపు ఉన్న దేశాలకు హెచ్చరికలు కూడా బైడెన్ ప్రభుత్వం జారీ చేసింది.

ఇదీ చదవండి:  యుద్ధంలో పైచేయి ఎవరిది..? రష్యా ఓడిందా..? అందుకే పాత కాలం నాటి మిస్సైల్స్‌ను ఉపయోగిస్తుందా..?


తైవాన్‌పై జిన్‌పింగ్‌ దాడి చేయాలని చూస్తున్నారా?

కొత్త సవరణలతో నిరసనలను అణిచివేసేందుకు లేదా యుద్ధేతర ప్రయోజనాల కోసం సైన్యాన్ని ఉపయోగించుకోవడానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ఇటీవల అనుమతి ఇచ్చారు. ఈ మేరకు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చిన నాన్ వార్ మిలటరీ యాక్టివిటీస్ (NWMA)కి జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ NWMAలో ఆరు చార్టర్లు, 59 కథనాలు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా అనుసరించిన పద్ధతినే చైనా కూడా అనుసరిస్తోందని చెబుతున్న కొందరు నిపుణులు

అచ్చం రష్యా లాగే చైనా కూడా..

"ప్రత్యేక సైనిక ఆపరేషన్" నెపంతో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినట్లే.. చైనా కూడా కొత్త ఆదేశాలను ఉపయోగించుకుని ప్రత్యేక సైనిక చర్య పేరిట తైవాన్‌పై దాడులు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. తైవాన్, జపాన్, దక్షిణ కొరియాలకు ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించే ప్రయత్నంలో చైనా.. PLA తైవాన్ జలసంధిని నిరోధించగలదని కూడా అంటున్న నిపుణులు అంటున్నారు. అయితే తైవాన్ జలసంధిలో ఏదైనా శత్రు సైనిక జోక్యానికి ప్రతీకారంగా ఎదురుదెబ్బ కొట్టే సామర్థ్యం తమకు ఉందని తైవాన్ కూడా గట్టి హెచ్చరికలు పంపుతోంది. తమ స్వదేశీ యున్ ఫెంగ్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బీజింగ్‌కు చేరుకోగలదని తైవాన్ నేరుగా హెచ్చరించింది.


ఇదీ చదవండి:  మరో అద్భుతానికి అమెరికా శ్రీకారం.. లార్జెస్ట్ సబ్‌మెరైన్ నిర్మాణంలో యూఎస్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?


చైనా విభజన నిరోధక చట్టం

తైవాన్‌ను ప్రధాన భూభాగ నియంత్రణలోకి తీసుకురావడానికి బలప్రయోగానికి చట్టబద్ధత కల్పించే చట్టాన్ని చైనా ఇప్పటికే తీసుకొచ్చింది. తైవాన్‌ను చైనాలో భాగమని, ఏకీకరణను సాధించడానికి శాంతియుత మార్గాలను ఏకపక్షంగా ఉపయోగించవచ్చని విభజన నిరోధక చట్టం సూచిస్తోంది. తైవాన్‌పై దాడి చేయడానికి చైనా యుద్ధం కూడా ప్రకటించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది నవంబర్‌లో తైవాన్ రెడ్ లైన్ దాటితే చైనా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని యూఎస్‌ అధ్యక్షుడితో కూడా జిన్‌పింగ్‌ చెప్పారు. చట్టబద్ధమైన స్వాతంత్ర్యం కోరడం ద్వారా తైపీ రెడ్ లైన్ దాటిందని బీజింగ్ విశ్వసిస్తే, వేర్పాటు నిరోధక చట్టం ప్రకారం PLA తైవాన్‌పై దాడి చేసే అవకాశం ఉంది. దేశంలో రాజకీయ పరంగా సమస్యలు రాకుండా ముందుగానే NWMA తీసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

చైనా తన స్వప్రయోజనాల కోసమే

ప్రస్తుతం చైనాలో 2,500 మంది శాంతి పరిరక్షకులు ఉన్నారు, వీరిలో కొందరు ఆఫ్ఘనిస్తాన్, మరికొందరు పాకిస్థాన్‌లో ఉన్నారు. ఈ దళాలు చైనా జాతీయులను తీవ్రవాద దాడులకు గురికాకుండా కాపాడుతుంటాయి. ఏప్రిల్ 26న కరాచీలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో బలూచ్ వేర్పాటువాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనా ఉపాధ్యాయులు మరణించారు. 2021 జూలైలో పాకిస్థాన్‌లో జరిగిన మరో ఆత్మాహుతి బాంబు దాడిలో తొమ్మిది మంది చైనా కార్మికులను ఇస్లామిక్ మిలిటెంట్లు చంపేశారు. బీజింగ్ తన పౌరులను, ప్రాజెక్టులను రక్షించడానికి ఏకపక్షంగా తన దళాలను పాకిస్థాన్‌కు పంపడానికి NWMA అనుమతిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: China, Russia, Vladimir Putin, Xi Jinping

ఉత్తమ కథలు