హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine: యుద్ధంలో పైచేయి ఎవరిది..? రష్యా ఓడిందా..? అందుకే పాత కాలం నాటి మిస్సైల్స్‌ను ఉపయోగిస్తుందా..?

Russia-Ukraine: యుద్ధంలో పైచేయి ఎవరిది..? రష్యా ఓడిందా..? అందుకే పాత కాలం నాటి మిస్సైల్స్‌ను ఉపయోగిస్తుందా..?

రష్యా పాత మిస్సైల్స్‌ను ఉపయోగిస్తుందా..? ఇది దేనికి సంకేతం

రష్యా పాత మిస్సైల్స్‌ను ఉపయోగిస్తుందా..? ఇది దేనికి సంకేతం

యుద్ధంలో ఓడినోడికంటే గెలిచినోడికే ఎక్కువ నష్టం. ప్రపంచ యుద్ధాలు నేర్పిన ఓ గొప్ప గుణపాఠం ఇది. అందుకే రెండో ప్రపంచ యుద్ధం (world war) తర్వాత.. అగ్ర దేశాలన్నీ వార్ కంటే వార్నింగ్‌‌లకే ఎక్కువ ప్రాధన్యం ఇస్తూ వచ్చాయి. కానీ ఉక్రెయిన్‌పై (ukraine ) ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన రష్యా (russia) కయ్యానికి కాలు దువ్వి కోలుకోలేని నష్టాలను చవిచూసిందంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

యుద్ధంలో ఓడినోడికంటే గెలిచినోడికే ఎక్కువ నష్టం. ప్రపంచ యుద్ధాలు నేర్పిన ఓ గొప్ప గుణపాఠం ఇది. అందుకే రెండో ప్రపంచ యుద్ధం (world war) తర్వాత.. అగ్ర దేశాలన్నీ వార్ కంటే వార్నింగ్‌‌లకే ఎక్కువ ప్రాధన్యం ఇస్తూ వచ్చాయి. కానీ ఉక్రెయిన్‌పై (ukraine ) ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన రష్యా (russia) కయ్యానికి కాలు దువ్వి కోలుకోలేని నష్టాలను చవిచూసిందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీకారం, అహం రెండు దేశాల భవిష్యత్‌ను నాశనం చేసిందని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. మరి ఈ యుద్ధంలో రష్యా ఓడిందా.. గెలిచిందా..? రష్యా పాత కాలం నాటి మిస్సైల్ దాడి దేనికి సంకేతాలు..?

ఉక్రెయిన్‌లో జరుగుతున్న భీకర యుద్ధంలో రష్యా ఆయుధ నిల్వలు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో తయారు చేసిన మిస్సైల్స్‌ను ఉక్రెయిన్‌లో అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లడానికి ఉపయోగిస్తున్నట్లు ప్రపంచ దేశాలు కోడై కూస్తున్నాయి. విమాన వాహన నౌకలను లక్ష్యంగా చేసుకునేందుకు తయారు చేసిన ఐదున్నర టన్నుల మిస్సైల్‌తో ఇటీవల భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించినట్లు యూకే రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గ్రౌండ్-ఎటాక్ మోడల్ సంప్రదాయంలో వార్ హెడ్‌లు మోహరించినప్పుడు సక్రమంగా పనిచేయవని, గణనీయమైన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతుందని చెప్పిన యూకే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపారు.

ఏప్రిల్ నుంచి రష్యన్ మీడియం బాంబర్లు డజన్ల కొద్దీ 1960 నాటి Kh-22 ఎయిర్-లాంచ్డ్, భారీ యాంటీ-షిప్ మిసైల్స్‌ను ప్రయోగించినట్లు సమాచారం. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధంలో రష్యా నష్టాలను ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ నమోదు చేస్తున్నారు. దాంతో రష్యా భారీగా దెబ్బతిన్నట్లు వారి రిపోర్టుల ఆధారంగా తెలుస్తోంది.

యుద్ధంలో రష్యన్ నష్టాలు

715 ఆర్టిలరీ సిస్టమ్స్‌

226 మల్టిపుల్‌ రాకెట్‌ లాంచ్‌ సిస్టమ్‌

97 యాంటి ఎయిర్‌ క్రాఫ్ట్‌ సిస్టమ్‌

1,430 ట్యాంకులు

3,484 ఆర్మర్డ్‌ ఫైటింగ్‌ వెహికల్స్‌

2,455 వాహనాలు, ఇంధన ట్యాంకులు

178 హెలికాప్టర్లు

212 విమానాలు

582 డ్రోన్లు

13 పడవలు

ఇదీ చదవండి: పుతిన్ మలమూత్రాలను సేకరించేందుకు స్పెషల్‌ బాడీగార్డు.. చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ


రష్యా దళాలు తగ్గిపోతున్నాయా?

రష్యా సైనికుల కొరత ఎదుర్కొంటుందని.. మాస్కో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాన్‌బాస్‌లో దాడులు నిర్వహించడానికి పుతిన్ భాగస్వామ్య లేదా ప్రాక్సీ బలగాలను బలవంతం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అయినప్పటికీ బలగాల కొరత రష్యా దండయాత్ర విజయాన్ని దూరం చేస్తోందని విశ్లేషణలు చెబుతున్నారు. రష్యన్లు చర్యలు తీసుకోకపోతే క్రామాటోర్స్క్ రెండు లేదా మూడు వారాల వ్యవధిలోనే ఇబ్బందుల్లో పడేదన్న మాజీ సీనియర్ సైనిక సలహాదారు, మేజర్ జనరల్ చిప్ చాప్‌మన్ పేర్కొన్నారు.

రష్యన్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రముఖమైనది సిబ్బంది కొరత. వారు చెచెన్‌లు, వాగ్నర్ సమూహం, నావికా పదాతిదళం వంటి భాగస్వామ్య లేదా ప్రాక్సీ బలగాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలో లేదా తరువాత పదాతిదళ సిబ్బందిని రష్యా కోల్పోవడం బలహీనతగా మారుతుందని అంచనా వేస్తున్నారు. రష్యా దాదాపు 32,150 మంది సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ ఆధారాలతో సహా వివరిస్తోంది.

ఇదీ చదవండి: మరో అద్భుతానికి అమెరికా శ్రీకారం.. లార్జెస్ట్ సబ్‌మెరైన్ నిర్మాణంలో యూఎస్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?


ఉక్రెయిన్ ఆయుధాల కొరత సంక్షోభం

రష్యా దాడిని ఎదుర్కోవడానికి పశ్చిమ దేశాలు సరఫరా చేసిన ఆయుధాలపైనే పూర్తిగా ఆధారపడిన ఉక్రెయిన్‌.. ప్రస్తుతం జరుగుతున్న ఫిరంగుల యుద్ధంలో తాము ఓడిపోతున్నామని ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ హెడ్ వాడిమ్ స్కిబిట్స్సీ తెలిపారు. ప్రస్తుతం ప్రతి దానికి పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధాలపై ఆధారపడి ఉన్నామని, ఉక్రెయిన్‌లో ఒక ఫిరంగి ముక్క ఉంటే, 10 నుంచి 15 రష్యన్ ఫిరంగి ముక్కలు ఉన్నాయని స్కిబిట్స్కీ చెబుతున్నారు. పశ్చిమ దేశాలు తమ వద్ద ఉన్న ఆయుధాలలో దాదాపు దాదాపు 10 శాతానికి పైగా ఉక్రెయిన్‌కు అందించినట్లు సమాచారం.

ఉక్రెయిన్‌లోని తూర్పు భాగంలో జరుగుతున్న ఫిరంగి యుద్ధంలో జెలన్స్కీ బలగాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌ సైనికులు షెల్‌లను సంరక్షించవలసి వస్తుండటంతో.. తరచుగా కాల్పులు జరపలేకపోతున్నట్లు సైనికులు చెబుతున్నారు. నాటో దేశాల నుంచి పుష్కలంగా మందుగుండు సామగ్రిని ఉక్రెయిన్ పొందినా.. పాత పరికరాలను భర్తీ చేయడానికి తగినంత ఆయుధాలు లేవన్న NYT నివేదిక చెబుతోంది. అనేక పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందజేస్తున్నా, డెలివరీలో జాప్యంతో ఉక్రెయిన్ ఇబ్బంది పడుతోంది. వంద రోజులకు పైగా జరుగుతున్న యుద్ధంతో ఇరు దేశాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని చవిచూశాయి.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

ఉత్తమ కథలు