జమ్మూకాశ్మీర్‌పై చైనా వ్యాఖ్యలకు భారత్ దీటైన కౌంటర్

జమ్మూకాశ్మీర్ మీద చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది.

news18-telugu
Updated: October 31, 2019, 9:56 PM IST
జమ్మూకాశ్మీర్‌పై చైనా వ్యాఖ్యలకు భారత్ దీటైన కౌంటర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూకాశ్మీర్‌ను రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడంపై చైనా వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూకాశ్మీర్ విభజన అనేది భారత అంతర్గత వ్యవహారమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇందులో ఇతర దేశాల జోక్యం చేసుకోవడం సరికాదని తేల్చిచెప్పింది. జమ్మూకాశ్మీర్‌ భూభాగంలో చొరబడుతోందని చైనాను ఆక్షేపించింది. ‘భారత్ అంతర్గత చట్టాలను మార్చుకోవడం ద్వారా చైనా సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తోంది. ఇది చట్టవిరుద్ధం. ఏదేమైనా ఆ భూమి చైనా కంట్రోల్లోనే ఉంటుంది.’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ మీడియాతో వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. ‘1963 పాకిస్తాన్ - చైనా ఒప్పందం పేరు చెప్పి... పీఓకేలోని కాశ్మీర్ భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించింది.’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఓ ప్రకటనలో మండిపడ్డారు.

జమ్మూకాశ్మీర్‌‌లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండుగా విభజించి, జమ్మూకాశ్మీర్, లద్ధాక్‌‌గా కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. అక్టోబర్ 31 నుంచి ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారికంగా మనుగడలోకి వచ్చాయి.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>