AP High Court on YS Jagan Govt | ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిన్న ఊరట లభించింది. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ విధాన పరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని హైకోర్టు గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల కొంతకాలం మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఏపీలో మద్యం దుకాణాలు తెరిచారు. అలాగే, మద్యం ధరలను 75 శాతం మేర పెంచారు. ఈ క్రమంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో కొందరు శానిటైజర్ తాగి ప్రాణాలుపోగొట్టుకున్నారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈ ఘటనలు వెలుగుచూశాయి.
మరోవైపు ఏపీలో మద్యం ధరలు పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం దిగుమతి అవుతోంది. తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలిస్తున్న వారిని సరిహద్దుల్లో పోలీసులు పట్టుకుంటున్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి మద్యం అక్రమరవాణాకు కట్టడి వేస్తున్నారు ఏపీ పోలీసులు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.