ప్రత్యేక కోర్టు...అతడికి బుధవారం జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. యాసిన్ మాలిక్(Yasin Malik)కు మరణ శిక్ష విధించాలని ఎన్ఐఏ గట్టిగా వాదించింది. అయితే కోర్టు మాత్రం యావజ్జీవ శిక్ష విధించింది. యాసిన్ మాలిక్‌కు రెండు జీవిత ఖైదులు, 10 నేరాలలో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 10 లక్షల జరిమానా, అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయబడతాయని కోర్టు తీర్పు చెప్పింది. అయితే యాసిన్ మాలిక్‌ను అన్ని కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని పాకిస్తాన్(Pakistan)విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ డిమాండ్ చేశారు.
మాలిక్ ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని, తద్వారా కుటుంబాన్ని కలిసేలా చూడాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బాచెలెకు బిలావల్ భుట్టో ఓ లేఖ రాశారు. కశ్మీరీలను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మే 24న బాచెలెకు లేఖ పంపినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కశ్మీరీలను అణచివేసి.. వారిని ప్రేరేపిత కేసుల్లో ఇరికించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లేఖలో వివరించాము అని చెప్పింది. యాసిన్ మాలిక్ పట్ల వ్యవహరించిన తీరును తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కౌన్సిల్‌ను భుట్టో లేఖలో కోరారు. మరోవైపు,ఓఐసీ(ఇస్లామిక్ సహకార సంస్థ) సెక్రటరీ జనరల్ హిస్సేన్ బ్రహింతాకు కూడా పాక్ విదేశాంగ మంత్రి లేఖ రాశారు. కశ్మీర్లో పరిస్థితుల గురించి ఆయనకు వివరించారు.
ALSO READ Rahul Gandhi : విదేశాంగ శాఖ అనుమతి లేకుండానే లండన్ కి రాహుల్!
జమ్ముకశ్మీర్ లో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ వీరి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండిట్లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్ఎఫ్కు సంబంధాలు ఉన్నాయి. యాసిన్ మాలిక్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో హైఅలెర్ట్ ప్రకటించారు. శ్రీనగర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్రోహశక్తులు అరాచకాలకు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఇంటర్నెట్ ను కట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Pakistan, United Nations