ఇమ్రాన్ అదో టైపు... బ‌లిప‌శువులా చూశాడ‌న్న మాజీ భార్య

తన‌తో క‌లిసి విలాస‌వంతంగా జీవించాల‌ని మాత్ర‌మే ఇమ్రాన్ కోరేవాడ‌ని రెహ‌మ్ తెలిపారు. అయితే జ‌ర్న‌లిస్ట్ అయిన తాను అలా ఉండ‌లేక‌పోయాన‌ని.. పీటీఐ పార్టీలో, అత‌డి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే అవినీతిని అత‌డి దృష్టికి తీసుకెళ్లాన‌ని చెప్పారు. ఇది ఇమ్రాన్‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ని, ఈ విష‌యంలోనే త‌న‌తో అత‌డు చాలాసార్లు గొడ‌వప‌డ్డాడ‌ని వెల్ల‌డించారు.

news18-telugu
Updated: August 27, 2018, 7:07 PM IST
ఇమ్రాన్ అదో టైపు... బ‌లిప‌శువులా చూశాడ‌న్న మాజీ భార్య
రెహమ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫొటోలు)
  • Share this:
పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్, అతడి మాజీ భార్య రెహ‌మ్ ఖాన్ మ‌ధ్య వివాదం ఇప్పుడ‌ప్పుడే ముగిసిపోయేలా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల త‌న ఆత్మ‌క‌థ పుస్త‌కాన్ని విడుద‌ల చేసిన రెహ‌మ్ ఖాన్‌, ఇమ్రాన్‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ఇమ్రాన్ ఓ ద్విలింగ సంపర్కుడని, డ్రగ్స్‌కు బానిస అని, పెద్ద అబ‌ద్దాల కోరు అని రెహ‌మ్ ఖాన్ త‌న ఆత్మ‌క‌థ‌లో పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో త‌న వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచే కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ(పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్‌) పార్టీకి చెందిన వాళ్లే ఈ ప‌ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇమ్రాన్ ఖాన్‌తో ప‌ది నెల‌ల పాటు సాగిన త‌న వైవాహిక జీవితంపై కూడా అనేక అంశాల‌ను వెల్ల‌డించారు రెహ‌మ్ ఖాన్‌.

తన‌తో క‌లిసి విలాస‌వంతంగా జీవించాల‌ని మాత్ర‌మే ఇమ్రాన్ కోరేవాడ‌ని రెహ‌మ్ తెలిపారు. అయితే జ‌ర్న‌లిస్ట్ అయిన తాను అలా ఉండ‌లేక‌పోయాన‌ని.. పీటీఐ పార్టీలో, అత‌డి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే అవినీతిని అత‌డి దృష్టికి తీసుకెళ్లాన‌ని చెప్పారు. ఇది ఇమ్రాన్‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ని, ఈ విష‌యంలోనే త‌న‌తో అత‌డు చాలాసార్లు గొడ‌వప‌డ్డాడ‌ని వెల్ల‌డించారు. తాను త‌న ల‌క్ష్యాల విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేద‌న్న రెహ‌మ్ ఖాన్‌, ఇది ఇమ్రాన్‌కు న‌చ్చ‌లేద‌ని తెలిపారు. ఈ కార‌ణంగానే త‌మ మ‌ధ్య గొడ‌వ‌లు పెరిగాయ‌ని, చివ‌ర‌కు ఇరువురు విడిపోయే వ‌ర‌కు వెళ్లింద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌ను భార్య‌గా కాకుండా ఓ బ‌లిప‌శువుగా ఇమ్రాన్ చూశాడ‌ని రెహ‌మ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: August 27, 2018, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading