Home /News /international /

RED AIR PLANE CARRYING 126 PASSENGERS CRASH LANDS AT MIAMI AIRPORT FLORIDA CATCHES FIRE VIRAL VIDEO MKS

Viral Video : ఎయిర్ పోర్టులో కూలిన విమానం.. మంటలు..126 ప్రయాణికులు.. చివరికి..

విమానం క్రాష్ ల్యాండ్ తర్వాత దృశ్యాలు

విమానం క్రాష్ ల్యాండ్ తర్వాత దృశ్యాలు

రెడ్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 126 మంది ప్రయాణికులతో క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానం కుడివైపు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందు, వెనుక టైర్లు పూర్తిగా తెరుచుకోని స్థితిలో పైలట్లు అత్యంత చాకచక్యంగా క్రాష్ ల్యాండ్ చేశారు.

విమానయాన చరిత్రలో మరో భయానక ప్రమాదం అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయం (Miami International Airport)లో చోటుచేసుకుంది. రెడ్ ఎయిర్ (Red Air) సంస్థకు చెందిన విమానం 126 మంది ప్రయాణికులతో క్రాష్ ల్యాండ్ (Plane Crash Land) అయింది.

దీంతో విమానం కుడివైపు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందు, వెనుక టైర్లు పూర్తిగా తెరుచుకోని స్థితిలో విమానం అమాంతం నేలను రాసుకుంటూ కూలింది. పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, లోపలున్న సిబ్బంది సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ద్వారం గుండా వడివడిగా ప్రయాణికులను కిందికి నెట్టేయడం, సమాయానికి ఫైర్ ఫైర్లు చేరుకోవడంతో పెను ముప్పు తప్పినట్లయింది.





క్రాష్ ల్యాండై మంటల్లో చిక్కుకున్న విమానం ఏక్షణమైనా పేలిపోవచ్చనే భయంతో ప్రయాణికులు పరుగులు తీస్తోన్న దృశ్యాలు వైరలయ్యాయి.



ఎమర్జెన్సీ ద్వారం నుంచి ప్రయాణికుల పరుగులు




కరీబియన్ దేశమైన డోమినికన్ రిపబ్లిక్‌కు చెందిన రెడ్ ఎయిర్ విమానం మంగళవారం సాయంత్రం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో క్రాష్ ల్యాండ్ అయింది. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో నుంచి మియామి సిటీకి బయలుదేరిన విమానంలో 126 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు.



సాయంత్రం 5.30కు విమానం మియామి ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉండగా, కొద్ది నిమిషాల ముందు ల్యాండింగ్ గేరు చెడిపోయినట్లు పైలట్లు గురించారు. క్రాష్ ల్యాండ్ చేయడం తప్ప మరో దారిలేని స్థితిలో పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు.

AP Inter results : ఇంకాసేపట్లో ఇంటర్ ఫలితాలు -లింక్స్ ఇవే -న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్‌లోనూ రిజల్ట్స్ చూడండి..


నేలను తాకిన మరుక్షణంలోనే విమానం కుడి రెక్కలో మంటలు చెలరేగాయి. ఎడమవైపు ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను వడివడిగా కిందికి పంపేశారు విమాన సిబ్బంది. విమానం నేలను తాకిన నిమిషంలోపే ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.

థ్రిల్లర్ సినిమాకు తీసిపోనిరీతిలో అక్కడ ఉత్కంఠభరిత దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా, మొత్తం 126 మంది సురక్షితంగా బయటపడ్డారు.
Published by:Madhu Kota
First published:

Tags: Florida, Plane Crash, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు