Home /News /international /

Girl education: అప్ఘనిస్తాన్​ బాలికలకు అండగా గళమెత్తిన నోబెల్​ అవార్డు గ్రహీత మలాలా.. సాయం చేయాలని అమెరికాకు విజ్ఞప్తి

Girl education: అప్ఘనిస్తాన్​ బాలికలకు అండగా గళమెత్తిన నోబెల్​ అవార్డు గ్రహీత మలాలా.. సాయం చేయాలని అమెరికాకు విజ్ఞప్తి

మలాలా (ఫైల్​)

మలాలా (ఫైల్​)

అప్ఘనిస్తాన్​లో తమకూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలని అమ్మాయిలు (girls) డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒకరికొకరు ఫొటోలు, వీడియోలు షేర్​ చేస్తున్నారు. నోబ్‌ల్‌ శాంతి బహుమతి గ్రహిత అఫ్ఘనిస్తాన్​ బాలికలకు మద్దతుగా గళమెత్తారు.

ఇంకా చదవండి ...
అప్ఘనిస్తాన్ (Afghanistan)​. గత కొద్దిరోజులుగా వణికిపోతోంది. తాలిబన్లు (Taliban's) దాడులు చేసి అప్ఘన్​ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాలిబన్లకు భయపడి లక్షలాది మంది దేశం (country) విడిచి ఇతర దేశాలకు (countries) వలసవెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలె తాలిబన్ల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం (new government) ఏర్పాటైంది. అయితే తాలిబాన్లు కొత్త ప్రభుత్వంలో పలు మార్పులకు (changes) శ్రీకారం చుట్టారు. సంస్థలు, నగరాల (cities) పేర్లను మార్చుతున్న తాలిబన్లు ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే పేరు మార్చడానికి కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే అప్ఘన్లో పాఠశాలలు (schools) ప్రారంభమైనా అక్కడ బాలురు (boys) మాత్రమే చదువుకోవడానికి వెళుతున్నారు. దీంతో తమకూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలని అమ్మాయిలు (girls) డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒకరికొకరు ఫొటోలు, వీడియోలు షేర్​ చేస్తున్నారు. నోబ్‌ల్‌ శాంతి బహుమతి గ్రహిత (Recipient of the Nobel Prize),  మలాలా యూసఫ్‌జాయ్ (Malala Yousafzai) అఫ్ఘనిస్తాన్​ బాలికలకు మద్దతుగా గళమెత్తారు.

సెకండరీ విద్య అందుబాటులో లేని ఏకైక దేశం..

వాషింగ్టన్ (Washington) పర్యటన సందర్భంగా అఫ్గాన్ బాలికలకు, మహిళలకు బలమైన యూఎస్‌ మద్దతు కావాలని మలాలా (Malala Yousafzai) కోరారు. అంతేకాదు ప్రస్తుతం బాలికలకు సెకండరీ విద్య అందుబాటులో లేని ఏకైక దేశం అఫ్ఘనిస్తాన్ (Afghanistan) అని, పైగా వారు విద్యనభ్యసించకుండా నిషేధించారంటూ యూఎస్‌ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ (Anthony Blinken‌)తో జరిగిన సమావేశంలో మలాలా గుర్తుచేశారు

ఈ మేరకు ఈ సమావేశంలో మలాల సోటోడా (Malala Sotoda) అనే అఫ్గాన్‌ అమ్మాయి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (US President Joe Biden)కి రాసిన లేఖను ప్రస్తావిస్తూ ‘ఇది అఫ్గాన్‌ బాలికల సందేశం. బాలికలందరికీ సురక్షితమైన మరియు నాణ్యమైన విద్యను పొందగలిగే ప్రపంచాన్ని మేము చూడాలనుకుంటున్నాం’ అని రాసిన లేఖను బ్లింకెన్‌కి మలాలా యూసఫ్‌జాయ్ అందజేశారు. అంతేకాదు తమను ఎంతకాలం పాఠశాలలకు (Schools), విశ్వవిద్యాలయాలకు (Universities) దూరం చేస్తారో అంతలా తమ భవిష్యత్తుపై ఆశ చిగురిస్తూనే ఉంటుందని సోటోడా లేఖలో ప్రస్తావించిన విషయాన్ని మలాలా పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో శాంతి భద్రతలను తీసుకురాగలిగే అతి ముఖ్యమైన సాధనం బాలికల విద్య (girl education) అని, అమ్మాయిలు చదువుకోకపోతే అఫ్ఘాన్‌ నష్టపోతుందంటూ ఆవేదనగా పేర్కొంది.

అయితే అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని (Taliban government in Afghanistan)  ఏర్పాటు చేసి బాలికలు విద్యనభ్యసించకూడదంటూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలాలా యునైటెడ్ స్టేట్స్, యుఎన్‌తో కలిసి అఫ్ఘాన్‌లోని బాలికలు (girls) వీలైనంత త్వరగా తమ పాఠశాలలకు (schools) తిరిగి వెళ్లేలా చూసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Afghanistan, America, EDUCATION, School girl

తదుపరి వార్తలు