5వేల ఏళ్ల కిందట ఏం జరిగింది? రావణుడి యాత్రపై శ్రీలంక ప్రభుత్వం పరిశోధన

ఈ ప్రపంచంలో మొట్టమొదటి పైలట్... రావణాసురుడని శ్రీలంక ప్రభుత్వం నమ్ముతోంది. ఐదు వేళ్ల ఏళ్ల కిందటే ఆయన గగన యాత్ర చేశారనే ఆలోచనతో కొత్త పరిశోధన మొదలుపెట్టింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 1, 2019, 10:24 AM IST
5వేల ఏళ్ల కిందట ఏం జరిగింది? రావణుడి యాత్రపై శ్రీలంక ప్రభుత్వం పరిశోధన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
5వేల ఏళ్ల కిందట రావణాసురుడు ఎలా గాల్లో ప్రయాణించాడు? ఆయన వాడిన విమానం ఎలాంటిది? అది పుష్పక విమానమా లేక మరేదైనా ఉందా? అసలు ఆ విమానం ఎలా పనిచేసేది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతకాలనుకుంటోంది శ్రీలంక ప్రభుత్వం. విమానాన్ని (5వేల ఏళ్ల కిందట) ఉపయోగించిన తొలి ఫ్లైట్ ఇంజినీర్ రావణుడేనని నిరూపిస్తామన్నారు న్యూస్18తో ఫోన్‌లో మాట్లాడుతూ కొలంబో పౌర విమానయాన శాఖ వైస్ ఛైర్మన్ షాషి దనతుంగే. "రావణుడు చాలా తెలివైన వాడు. మొదటిసారి గాల్లో ఎగిరింది ఆయన. ఆయన ఓ పైలట్ ఇది ఊహా కల్పితం కాదు. ఇది నిజం. దీనిపై వివరణాత్మక పరిశోధన జరగాల్సి ఉంది. వచ్చే ఐదేళ్లలో మేం దాన్ని నిరూపిస్తాం" అని ఆయన అన్నారు.

పౌర విమానయాన శాఖ నిపుణులు, చరిత్రకారులు, పురతత్వవేత్తలు, సైంటిస్టులు, ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కలిసి కటునాయకే దగ్గర సమావేశమయ్యారు. అక్కడ శ్రీలంకలోని అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం బండారునాయకే ఉంది. 5వేల ఏళ్ల కిందట రావణుడు వాయు మార్గంలో ఇండియా నుంచీ శ్రీలంకకు వెళ్లాడనీ, తిరిగి శ్రీలంక వచ్చాడని వాళ్లు తేల్చారు. ఐతే చాలా మంది శ్రీరాముడి సతీమణి సీతాదేవిని రావణుడు కిడ్నాప్ చేశాడన్న అంశాన్ని మాత్రం వారిలో ఎక్కువ మంది... ఒప్పుకోలేదు. అది భారతీయులు చెప్పుకుంటున్న వెర్షన్ అనీ... ఆ విషయం పక్కన పెట్టి... అసలు రావణుడు ఎలా వెళ్లి రాగలిగాడో తేల్చాలని వాళ్లు ఫైనల్‌గా నిర్ణయించుకున్నారు.

ఇటీవల రావణుడిపై శ్రీలంక ప్రజలకు ఒకింత ఆసక్తి పెరిగింది. ఈమధ్య శ్రీలంక ప్రభుత్వం... రావణ పేరుతో ఓ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. అది శ్రీలంక మొదటి స్పేస్ మిషన్.

చాలా మంది లంకేయులు... రావణుడు చాలా దయాగుణం కలిగినవాడనీ, మేధావి అని నమ్ముతున్నారు. భారతీయ పురాణాల్లో కూడా రావణుడు మహా బ్రాహ్మణుడు అనీ, పండితుడు అనీ చెబుతున్నాయి.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు