Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: August 30, 2019, 2:24 PM IST
రెండు తలల తాబేలు (Image : FB - hhiseaturtle)
Hilton Head Island, South Carolina : దక్షిణ కరోలినాలోని... హిల్టన్ హెడ్ దీవిలో... సముద్ర తాబేళ్లను పరిశీలించే బృందం ఒకటి... చిత్రమైన తాబేలును కనిపెట్టింది. దానికి రెండు తలలు ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. జన్యుపరమైన లోపాల వల్లే... ఆ తాబేలుకి రెండో తల ఏర్పడిందని... ఆ గ్రూప్ లీడరైన మెరైన్ బయాలజిస్ట్ అంబెర్ క్యూన్ తెలిపారు. ఆ తాబేలు తలలకు స్క్విర్ట్, క్రష్ అనే పేర్లు పెట్టినట్లు వివరించారు. భూమిపై, నీటిలో కూడా బతికే జీవుల్లో ఎక్కువగా ఇలాంటి అదనపు అవయవాలు ఉంటుంటాయి. అయినప్పటికీ... ఓవరాల్గా ఇలాంటి జీవుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు తలల తాబేలు ఫొటో ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. చాలా మంది ఈ ఫొటో చూసి... సముద్రంలోకి వెళ్లిన ఆ చిట్టి తాబేలుకి గుడ్ లక్ చెబుతున్నారు.
బాధాకరమైన విషయమేంటంటే... ఆ తాబేలు ఎక్కువ కాలం జీవించడం కష్టమే అంటున్నారు. ఇందుకు కారణం రెండు తలలే. వాటిలో మెదళ్లు... రెండూ వేర్వేరుగా ఆలోచిస్తాయి. అందువల్ల అది సముద్రంలో సరిగా ఈదలేదు. రెండు తలల మధ్యా కోపరేషన్ ఉండకపోవడం వల్ల ఆ తాబేలు జీవించడం కష్టమవుతుంది. నెటిజన్లు మాత్రం... అది బతకాలనీ, అలాంటి అరుదైన జీవులు బతికి ఉండాలని కోరుతున్నారు. దాన్ని నిజంగా ఎలాగూ చూడలేం... కనీసం ఫొటోలోనైనా చూడటం తమ అదృష్టం అంటున్నారు.
ఆ తాబేలుకి చిన్నసైజు ట్రాకర్ ఏదైనా తగిలించి, సముద్రంలోకి వదిలి ఉంటే బాగుంటుందని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు. ఆ ట్రాకర్ వల్ల... అది ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుస్తుందనీ, దానికి అనారోగ్యం వస్తే... వెంటనే దాన్ని కాపాడేందుకు వీలయ్యేదని అన్నారు.
Published by:
Krishna Kumar N
First published:
August 30, 2019, 2:20 PM IST