Rare Fish : ఒక్క చేప ఖరీదు 86 లక్షలు...దీని ప్రత్యేకత ఏంటి...?

ఒక్క చేప ఖరీదు 86 లక్షలు...దీని ప్రత్యేకత ఏంటి...?

Costly Fish : ఓ మత్స్యకారుడు ఒక చేపతో లక్షాధికారి అయ్యాడు. జీవీత కాలం చేపలను పట్టడడమే వృత్తిగా చేసుకున్న కుటుంబానికి ఒక్క చేపతో దశ తిరిగింది..దీంతో సముద్రంలో తనకు దొరికిన చేపతో పండగ చేసుకున్నాడు..ఒక్క చేపను ఏకంగా అక్షరాల 86 లక్షల రూపాయలకు వేలంలో అమ్మాడు.

  • Share this:
కొంతమందికి అదృష్టం వెంటాడుతోంది..చేసే వృత్తిపనిలో ఎన్నో ఎళ్లు కష్టపడేవారికి ఇలా ఏదోఒక రూపంలో అప్పుడప్పుడు అదృష్టం తన్నుక వస్తుంది.. దీంతో ఎవరి ఊహించని విధంగా తాము చేసే పనిలో లక్షల విలువ చేసే వాటిని తమ స్వంతం చేసుకుంటారు..ఇలా తాజాగా ఏపిలో ఓ రైతుకు తన భూమిలో వజ్రం దొరికి ఒకేసారి కోటిశ్వరు అయిని సంగతి తెలిసిందే...అయితే ఈసారి మత్స్యకారుడికి అరుదైన చేపదొరకడంతో లక్షాధికారి అయ్యాడు.

పాకిస్తాన్‌లోని బలుచిస్తాన్ తీరంలో గ్యాదరీ తీరానికి చెందిన మత్స్యకారుడుడు చేపలు పడుతున్న క్రమంలో ఓ అరుదైన చేపను పట్టాడు.తనకు తీరంలో అట్లాంటిక్ క్రోకర్ జాతికి చెందిన 48కిలోల చేప వలలో చిక్కింది..అయితే అయితే ఇది చాల అరుదైన చేపగా చెబుతున్నారు..దీనికి చైనా యూరప్ లాంటీ దేశాల్లో చాల డిమాండ్ ఉంటుందట...ఈ క్రోకర్ చేప తినేందుకు మాత్రం కాదు. ఔషధాల తయారీల్లో వాడతారు. ముఖ్యంగా చేప చర్మం, ఎముకలను వివిధ వైద్యపరమైన ఔషధాల్లో వాడతారు. దీంతో ఈ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

దీంతో ఈ చేపను మత్య్యకారుడు వేలానికి వేశాడు..వేలంలో ఎవరు ఊహించని ధర పలికింది. ఏకంగా చేపను 86 లక్షల నాలుగు వేల రూపాయలకు చేజిక్కించుకున్నారు. కాని స్థానిక సంప్రదాయల ప్రకారం ఎక్కువ మొత్తం చేప ధర పలికితే దానిలో కొంత డిస్కౌంట్ ఇంచే పద్దతి కూడ ఉండడంతో చివరికి 72లక్షల రూపాయలకు ధర నిర్ణయమయింది. అయితే ఇటివల గతవారం కూడ క్రోకర్ జాతికి చెందిన చేప దొరకడంతో దాని ధర కూడ సుమారు ఎనిమిది లక్షల రూపాయలు పలికిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. సో మొత్తం మీద చేపల వృత్తిలో బ్రతుకు పోరాటంతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన చేపలు దొరకడం ద్వార స్థానిక మత్స్యకారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: