హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Sri Lanka President : లంకాధీశుడిగా రణిల్ ప్రమాణస్వీకారం..లంకని గట్టేక్కిస్తాడా!

Sri Lanka President : లంకాధీశుడిగా రణిల్ ప్రమాణస్వీకారం..లంకని గట్టేక్కిస్తాడా!

రణిల్ విక్రమసింఘే(ఫైల్ ఫొటో)

రణిల్ విక్రమసింఘే(ఫైల్ ఫొటో)

Sri Lanka President : ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంక (Sri lanka) అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe)ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. బుధవారం శ్రీలంక దేశానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు జరిగిన పార్లమెంట్ ఓటింగ్‌లో విజయం సాధించిన తర్వాత, రణిల్ విక్రమసింఘే(73) గురువారం (జూలై 21, 2022) కొలంబోలోని శ్రీలంక పార్లమెంట్ కాంప్లెక్స్‌లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇంకా చదవండి ...

  Sri Lanka President : ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంక (Sri lanka) అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe)ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. బుధవారం శ్రీలంక దేశానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు జరిగిన పార్లమెంట్ ఓటింగ్‌లో విజయం సాధించిన తర్వాత, రణిల్ విక్రమసింఘే(73) గురువారం (జూలై 21, 2022) కొలంబోలోని శ్రీలంక పార్లమెంట్ కాంప్లెక్స్‌లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీలంక ఎనిమిదోవ అధ్య‌క్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. పార్లమెంటులో ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడిన మొదటి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేనే. రాజకీయ అనుభవజ్ఞుడైన రణిల్ విక్రమసింఘే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించడం, నెలలుగా శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలను కట్టడి చేసి దేశాన్ని పునరుద్ధరించడం వంటి కఠినమైన పనిని ఎదుర్కోవలసి ఉంటుంది.

  గత వారం గోటబయ రాజపక్సా శ్రీలంక దేశం నుండి పారిపోయి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్య‌త‌లు స్వీకరించిన విషయం తెలిసిందే. రాణిల్ దేశాధ్య‌క్షుడిగా రణిల్ పగ్గాలు అందుకున్నా.. ప్ర‌జ‌ల్లో మాత్రం అస‌హ‌నం ఉంది. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నారు. ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో రణిల్ త‌ప్పుకోవాల‌ని నిర‌స‌న‌కారులు డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే.

  Sharad Pawar : రాజకీయ చాణక్యుడే..శరద్ పవార్ సంచలన నిర్ణయం

  రణిల్ రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టు, న్యాయవాది కూడా పనిచేశారు. 1977లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా పార్లమెంటు సభ్యుడు అయ్యారు. 1993లో తొలిసారి ప్రధాని అయ్యారు. శ్రీలంక ప్రధానిగా ఆరు సార్లు పనిచేసిన అనుభవం రణిల్ విక్రమసింఘే సొంతం. ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన కొద్దిరోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గొటబాయ పరారీ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు సభలో మెజార్టీ సభ్యుల మద్దతుతో పూర్తిస్థాయిలో అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. విదేశీ మారక నిల్వలు అడుగంటి, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతూ తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న దేశాన్ని ఎలాగైనా గట్టెక్కించడం ఆయన ముందున్న ప్రధాన సవాలు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: President, Ranil Wickremesinghe, Srilanka

  ఉత్తమ కథలు