ఆర్థిక సంక్షోభం కారణంగా విధ్వంసం చోటు చేసుకుంటున్న శ్రీలంకలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఆ దేశ ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేయడంతో.. కొత్త ప్రధానమంత్రి పదవి చేపట్టబోయేది ఎవరనే దానిపై చర్చ మొదలైంది. తాజాగా శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘేను(Ranil Vikramasinghe) నియమించారు ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే. ఆయన శ్రీలంక ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్టు ఆ దేశ అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. నిన్న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు గోటబయ.. వారం రోజుల్లో దేశానికి ఒక ప్రధానమంత్రి, మంత్రివర్గం ఏర్పాటు చేయబడుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో(Financial Crisis) సతమతమవుతున్న శ్రీలంకలో.. ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయడంతో సోమవారం గందరగోళంలో కూరుకుపోయింది.
ఇక ఆర్థిక సంక్షోభం తర్వాత శ్రీలంక ప్రజల్లో చెలరేగిన అశాంతి ఆ దేశాన్ని అట్టుడికేలా చేస్తోంది. రోజురోజుకు అక్కడి పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Gotabaya Rajapakse) కుటుంబానికి చెందిన పలువురు రాజకీయ నేతల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్రజల ఆగ్రహవేశాలు చూసి రాజకీయ నేతలు దేశాన్ని వీడిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్స శ్రీలంక ఆర్మీకి సంచలన ఆదేశాలు ఇచ్చారు.
మూడు రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనల్లో అధికార పార్టీకి చెందిన ఓ నేత, పోలీస్ అధికారి సహా మొత్తం 8 మంది మృతి చెందారు. మరో 219 మంది వరకు గాయపడ్డారు.
హింసాత్మక ఘటనలకు అధికార పార్టీ మద్దతుదారులే కారణమన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై మహీంద రాజపక్స మద్దతుదారులు దాడులకు పాల్పడటం వల్లే హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.