హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

List of Royal Successors: తుదిశ్వాస విడిచిన క్వీన్ ఎలిజబెత్ 2.. బ్రిటన్‌ కింగ్‌గా చార్లెస్.. రాయల్‌ ఫ్యామిలీ వారసుల జాబితా ఇదే..

List of Royal Successors: తుదిశ్వాస విడిచిన క్వీన్ ఎలిజబెత్ 2.. బ్రిటన్‌ కింగ్‌గా చార్లెస్.. రాయల్‌ ఫ్యామిలీ వారసుల జాబితా ఇదే..

 పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తో క్వీన్ ఎలిజబెత్(ఫైల్ ఫొటో)

పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తో క్వీన్ ఎలిజబెత్(ఫైల్ ఫొటో)

క్వీన్‌ ఎలిజబెత్‌ 2 తదనంతరం బ్రిటన్‌ను పాలించేది ఎవరు? భవిష్యత్తులో రాజ కుటుంబం వారసులుగా బ్రిటన్‌ను పాలించే అవకాశం ఎవరికి దక్కుతుందో చూద్దాం..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Queen Elizabeth II Passed Away :సుదీర్ఘకాలం బ్రిటన్‌(Britain)ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2(Queen Elizabeth 2) గురువారం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించిన కొంతసేపటికి క్వీన్‌ ఎలిజబెత్‌ ప్రాణాలు విడిచారు. 22 ఏళ్ల వయసులో కిరీటం ధరించిన క్వీన్‌ ఎలిజబెత్‌ 2, 96 ఏళ్ల వయసులో మరణించారు. 1947లో క్వీన్‌ ఎలిజబెత్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌ మౌంట్‌ బాటెన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె మృతిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. క్వీన్‌ ఎలిజబెత్‌ 2 తదనంతరం బ్రిటన్‌ను పాలించేది ఎవరు? భవిష్యత్తులో రాజ కుటుంబం వారసులుగా బ్రిటన్‌ను పాలించే అవకాశం ఎవరికి దక్కుతుందో చూద్దాం..

* బ్రిటన్‌ కింగ్‌ అయిన ప్రిన్స్‌ చార్లెస్‌(Prince Charles)

ప్రోటోకాల్ ప్రకారం క్వీన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్(73) ఇప్పుడు బ్రిటన్‌ కింగ్‌ అయ్యారు. ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ మొదట డయానా స్పెన్సర్‌ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆమెతో విడిపోయారు. డయానా మరణం తర్వాత, ఆయన 2005లో కెమిల్లా పార్కర్ బౌల్స్‌ను వివాహం చేసుకున్నారు.

* రాజవంశంలో ఉన్న వారసులు వీరే..

* ప్రిన్స్ విలియం(Prince William)

ప్రిన్స్ చార్లెస్, దివంగత ప్రిన్సెస్‌ డయానాల మొదటి కుమారుడు ప్రిన్స్ విలియం. ఇప్పుడు డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ హోదాలో ఉన్న ఆయన, ఎలిజబెత్‌ 2 మరణం తర్వాత జరిగిన మార్పుల్లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బిరుదు పొందుతారు. ప్రిన్స్‌ విలియం కేట్ మిడిల్టన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు.

* ప్రిన్స్ జార్జ్(Prince George)

బ్రిటన్‌ సింహాసనం అధిష్టించే అవకాశం ఉన్న వారిలో రెండో వరుసలో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్‌ మొదటి కుమారుడు ప్రిన్స్ జార్జ్(9) ఉన్నాడు.

Queen Elizabeth II : క్వీన్ ఎలిజబెత్‌ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..పాస్‌పోర్ట్,వీసా లేకుండానే ప్రపంచంలో ఎక్కడికైనా!

* ప్రిన్సెస్ చార్లెట్(Princess Charlotte)

రాజ వారసత్వపు మూడో వరుసలో ప్రిన్సెస్ చార్లెట్(7) ఉంది. ఆమె విలియం, కేట్‌ల రెండవ సంతానం.

* ప్రిన్స్ లూయిస్(Prince Louis)

బ్రటిన్‌ను పాలించే అవకాశం ఉన్న నాలుగో వ్యక్తి ప్రిన్స్ లూయిస్‌. 2018లో ప్రిన్స్‌ విలియం, కేట్‌కు జన్మించిన మూడవ సంతానం.

* ప్రిన్స్ హ్యారీ(Prince Harry)

ప్రిన్స్ చార్లెస్, డయానా రెండవ సంతానం ప్రిన్స్ హ్యారీ. బ్రిటన్‌ సింహాసనంపై కూర్చునే అవకాశం ఉన్న వ్యక్తుల్లో ఐదో వరుసలో ఉన్నారు. అతను రాయల్ మిలిటరీ ఆర్మీలో శిక్షణ పొందారు, డ్యూక్ ఆఫ్ ససెక్స్ హోదా ఉంది. అతను 2018లో అమెరికన్ నటి మేఘన్ మార్కెల్‌ను వివాహం చేసుకున్నారు. 2020లో రాయల్ డ్యూటీస్‌ నుంచి తప్పుకున్నారు.

* ఆర్చీ హారిసన్ మౌంట్ బాటన్(Archie Harrison Mountbatten)

బ్రిటన్‌ను పాలించే అవకాశం పొందిన ఆరో వ్యక్తి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ మొదటి సంతానం ఆర్చీ హారిసన్ మౌంట్‌బాటెన్‌. 2019లో ఆర్చీ హారిసన్ మౌంట్‌బాటెన్‌ జన్మించాడు.

* లిలిబెట్ డయానా మౌంట్ బాటన్(Lilibet Diana Mountbatten)

రాజకుటుంబం వారసుల్లో కనిపించే ఏడో పేరు లిలిబెట్ డయానా మౌంట్‌బాటెన్‌. ఆమె ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌కు గతేడాది జన్మించిన రెండో సంతానం.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Queen Elizabeth II, Uk

ఉత్తమ కథలు