నాలుగు దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి అనతికాలంలోనే ప్రపంచం ముందు తనదైన స్థానాన్ని సంపాదించుకుందని, దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ప్రజాస్వామిక విలువల పాలనే క్వాడ్ కూటమికి ప్రధాన బలమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వివరాలివే..
ఇండో-పసిఫిక్ రీజియన్ (హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రం పరిధి)లో పటిష్ట భద్రత కోసం నాలుగు దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి అనతికాలంలోనే ప్రపంచం ముందు తనదైన స్థానాన్ని సంపాదించుకుందని, దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ప్రజాస్వామిక విలువల పాలనే క్వాడ్ కూటమికి ప్రధాన బలమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. (PM Modi At Quad Summit)
భారత్, అమెరికా, జపాన్ ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా ఉన్న క్వాడ్ కూటమి వార్షిక సదస్సును ప్రారంభిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్ రాజధాని టోక్యో వేదికగా క్వాడ్ సమ్మిట్ జరుగుతున్నది. మంగళవారం ఉదయమే వేదికపైకి చేరుకున్న నాలుగు దేశాల అధినేతలు పరస్పరం షేక్ హ్యాడ్, పలకరింపులు, ఫొటోషూట్ తో సందడి చేశారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ మాదిరిగా కూర్చొని నలుగు నేతలూ షార్ట్ గా ప్రారంభ ఉపన్యాసాలు చేశారు.
#WATCH Prime Minister Narendra Modi, US President Joe Biden, Australian PM Anthony Albanese and Japanese PM Fumio Kishida assemble for Quad Leaders' Summit in Tokyo pic.twitter.com/rwZJOeWTJA
స్వేచ్ఛ, పారదర్శకత కోసం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏర్పాటైన క్వాడ్ కూటమి.. దేశాల మధ్య పరస్పర విశ్వాసం, దృఢ సంకల్పం ప్రజాస్వామ్య సూత్రాల అమలుకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని, క్వాడ్ ఇప్పుడు ప్రపంచ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇంత తక్కువ సమయంలో ప్రపంచం ముందు క్వాడ్ తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్వాడ్ పరిధి క్రమంగా విస్తృరిస్తున్నది. ఈ కూటమి మరింత ప్రభావవంతంగా మారింది. ప్రజాస్వామిక శక్తులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
క్వాడ్ సదస్సులో మోదీ
CM KCR : సీఎం కేసీఆర్ అనూహ్యం.. దేశవ్యాప్త పర్యటన మధ్యలోనే అర్దాంతరంగా హైదరాబాద్కు.. కారణమిదే..
ఇండో పసిఫిక్ రీజియన్ లో క్వాడ్ కూటమే శక్తిమంతమైనదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. క్వాడ్ కేవలం తూతూమంత్రపు వ్యవహారం కాదని, భావితరాల శ్రేయస్సు దృష్ట్యా సమ్మిళిత అభివృద్ధి, భాగస్వామ్యుల శ్రేయస్సు కోసమే ఏర్పడిందని క్వాడ్ సదస్సు ప్రారంభఉపన్యాసంలో ఆయన చెప్పారు.
క్వాడ్ రెండో వార్షిక సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పాల్గొన్నారు. కూటమి అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలు, ప్రపంచ సమస్యల గురించి నేతలు చర్చలు జరిపారు. సదస్సు ముగిసే సమయానికి ఏకాభిప్రాయంతో కొన్ని తీర్మానాలను ఆమోదించనున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.