దుప్పట్లో దూరిన కొండచిలువ...కాస్త లేట్ అయితే ఫలహారమే...

ఆఫీసు నుంచి వచ్చి ఇంటికి వచ్చిన యజమాని ఫ్రెష్ అప్ అయి కాసేపు కునుకు తీద్దామని బెడ్ రూమ్ లోకి చేరి పరుపుపై నడుమువాల్చాడు. అయితే పరుపు ఎగుడు దిగుడుగా ఉండటంతో పాటు వెన్నుపాము దగ్గర ఏదో మెత్తగా కదులుతున్న ఫీలింగ్ కలిగింది.

news18-telugu
Updated: August 19, 2019, 6:47 PM IST
దుప్పట్లో దూరిన కొండచిలువ...కాస్త లేట్ అయితే ఫలహారమే...
బెడ్ పై రెస్ట్ తీసుకుంటున్న కొండచిలువ (Image: Facebook)
  • Share this:
ఆస్ట్రేలియాలో ఈ మధ్య కాలంలో వన్యప్రాణులు జనావాసాల్లో చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవలే క్వీన్స్ ల్యాండ్‌లోని ఓ ఇంట్లోని బెడ్రూమ్ లోకి ఏకంగా కొండచిలువ దూరి, వెచ్చగా వారి బెడ్ పై రెస్ట్ తీసుకుంది. ఇంతలో ఆఫీసు నుంచి వచ్చి ఇంటికి వచ్చిన యజమాని ఫ్రెష్ అప్ అయి కాసేపు కునుకు తీద్దామని బెడ్ రూమ్ లోకి చేరి పరుపుపై నడుమువాల్చాడు. అయితే పరుపు ఎగుడు దిగుడుగా ఉండటంతో పాటు వెన్నుపాము దగ్గర ఏదో మెత్తగా కదులుతున్న ఫీలింగ్ కలిగింది. పదే పదే నడుము కింద భాగంలో వింతగా అనుభవం కలగడంతో అనుమానం వచ్చిన ఆ ఇంటి యజమాని నెమ్మదిగా పడక దిగి, అసలు మంచంపై ఏముందా అని దుప్పటి తీసి చూశాడు. ఒక్కసారిగా సీన్ చూసి అవాక్కయ్యాడు. మంచంపై ఏకంగా 10 అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో కెవ్వున కేక వేసి బెడ్రూం నుంచి పారిపోయాడు.

కాస్త లేట్ అయ్యి ఉంటే కొండచిలువకు డిన్నర్ అయ్యే వాడినని ఆ ఇంటి యజమాని బ్రతుకు జీవుడా అనుకున్నాడు. అయితే తన ఇంట్లోకి కిండ చిలువ ఎలా వచ్చిందని ఆరా తీస్తే సీలింగ్‌కు వేలాడే లైట్  గుండా ప్రవేశించిందని తెలుసుకున్నాడు. వెంటనే స్నేక్ క్యాచర్ అసోసియేషన్‌కు ఫోన్ చేయగా, వాళ్లు వచ్చి కొండచిలువను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఆ ఇంటి యజమాని ఊపిరిపీల్చుకున్నాడు.First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు