వ్లాదిమిర్ పుతిన్(Putin) డూమ్ డే(Doomsday) విమానం మాస్కోలో(Moscow) ఎగురుతూ కనిపించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందనే భయాల మధ్య ఈ దృశ్యం కనిపించింది. మే 9న వార్షిక విక్టరీ డే పరేడ్‌లో ఇల్యుషిన్ II-80 ప్రదర్శిస్తామని రష్యా ప్రకటించింది. విక్టరీ డే ప్రదర్శన కోసం విమానం 'రిహార్సల్స్'లో పాల్గొన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇల్యుషిన్ II-80ని 'ఫ్లైయింగ్ క్రెమ్లిన్' అని ఎందుకు పిలుస్తారంటే.. 1985లో ఇల్యుషిన్ II-80 మొదటి విమానం తయారీ.. కొన్ని మార్పుల తర్వాత 1987లో డెలివరీలు ప్రారంభమయ్యాయి. తమ నౌకాదళంలో ఇల్యుషిన్ II-80 4 యూనిట్లు ఉన్నాయని తెలిపిన రష్యా నివేదికలు.. దీనికి మాక్స్‌డోమ్ అని పేరు పెట్టాయి.
విమానం II-86 అప్టేట్ వెర్షన్ 500 mph కంటే ఎక్కువ వేగంతో దాదాపు 33,000 అడుగుల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉంటుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌కు కిటికీలు ఉండవు.. కాక్‌పిట్ కిటికీలను కూడా అడ్డుకొనేలా నిర్మాణం ఉంటుంది. ఈ లక్షణాలతో విద్యుదయస్కాంత పల్స్ (EMP) లేదా అణు విస్ఫోటనం నుంచి రక్షణ పొందవచ్చు. ఇల్యుషిన్ II-80ని గాలిలో ఇంధనం నింపవచ్చు, అణు దాడి జరిగినప్పుడు 'క్రెమ్లిన్-ఇన్-ది-స్కై' వలె పని చేస్తుంది. అణు దాడి జరిగినప్పుడు పుతిన్ తన సైన్యానికి ‘డూమ్స్ డే’ విమానం నుంచి ఆదేశాలు జారీ చేసే సదుపాయం ఉంది. ఈ విమానంలోని ఇంజిన్‌లో రెండు పెద్ద ఎలక్ట్రికల్ జనరేటర్ పాడ్‌లు, వాటి చివర్లలో ఎయిర్ ఇన్‌టేక్ స్కూప్‌లు, జెట్ ఎగ్జాస్ట్‌లు ఉంటాయి. సంఖ్యాపరంగా తగ్గిన ఎయిర్‌క్రాఫ్ట్‌లోని పై డెక్ డోర్లు, ఒక ఎయిర్‌స్టెయిర్ మిగిలాయి.
‘డూమ్స్‌డే ప్లేన్’తో పశ్చిమ దేశాలను ఎందుకు ఆందోళన..?
ఇల్యుషిన్ II-80ను చాలా తక్కువగా రష్యా ప్రదర్శించడంతో పశ్చిమ దేశాలలో ఆందోళన నెలకొంది. 2010 నుంచి ఏ విక్టరీ డే వేడుకల్లోనూ పాల్గొనని ఇల్యుషిన్ II-80.. ఉక్రెయిన్ యుద్ధంలో పెద్ద సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనుకాడబోమని రష్యా ముందే చెప్పింది. ఇల్యుషిన్ II-80 విమానం మళ్లీ కనిపించడం అనేది పశ్చిమ దేశాలకు పుతిన్ ఉద్దేశపూర్వక మెసేజ్ అని నిపుణులు అంటున్నారు.
విక్టరీ డే ఈవెంట్ ఉక్రెయిన్, బియాండ్‌కి ఒక మెసేజ్..?
విక్టరీ డే వేడుకను రష్యా సైనిక బలగాల శక్తిని చాటుకునేందుకు పుతిన్ ఉపయోగించుకుంటారని విశ్లేషకులు అంటున్నారు. విక్టరీ డే వేడుకల సందర్భంగా రెండు MiG-29 విమానాలతో ఇల్యుషిన్ II-80 జతకట్టనున్నాయి. కార్యక్రమంలో వ్యూహాత్మక క్షిపణి వాహకాలు Tu-95MS, Tu-160 ‘వైట్ స్వాన్’ పాల్గొననున్నాయి. ప్రదర్శనలో కనిపించనున్న ఐదవ తరం Su-57 ఫైటర్, Tu-22M3 దీర్ఘ-శ్రేణి బాంబర్లు. ఎనిమిది MiG-29SMTలు ‘Z’ అక్షరం రూపంలో ఎగురుతాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి చిహ్నంగా రష్యా ట్యాంకులపై కనిపించే ‘Z’ అక్షరం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Vladimir Putin