PUTIN VERY ILL WITH BLOOD CANCER RUSSIAN OLIGARCH CLAIMS FUEL ILLNESS RUMOURS PVN
Putin Health : ఏ నిమిషానికి ఏమి జరుగునో..పుతిన్ కు తీవ్ర అనారోగ్యం
పుతిన్(ఫైల్ ఫొటో)
Putin very ill with blood cancer : భారత్ కు దశాబ్దాలుగా మిత్రదేశంగా ఉన్న రష్యా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల విమర్శలు అందుకుంటోంది. కారణం ఆ దేశపు పొరుగుదేశం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడమే. దాదాపు మూడు నెలల నుంచి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది.
Putin Health Condition : భారత్ కు దశాబ్దాలుగా మిత్రదేశంగా ఉన్న రష్యా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల విమర్శలు అందుకుంటోంది. కారణం ఆ దేశపు పొరుగుదేశం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడమే. దాదాపు మూడు నెలల నుంచి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యుద్దం నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చనీయాంశంగా మారారు. నిన్నటి వరకూ యుద్ధం కారణంగా చర్చనీయాంశమైతే..ఇప్పుడతని గురించి మరో కీలకమైన అప్డేట్ వెలువడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని సమాచారం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, రక్త కేన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ వెల్లడించారు. యూఎస్ కు చెందిన ఓ మేగజీన్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని క్రిస్టోఫర్ వెల్లడించారు. "కచ్చితంగా ఆయన అనారోగ్య సమస్య ఏమిటనేది తెలియదు. అది నయమయ్యేదేనా, కాదా అనేదీ తెలియదు. కానీ యుద్ధ సమీకరణాల్లో అదీ ఒక భాగమే. రష్యా నుంచి, ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం పుతిన్ చాలా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు" అని చెప్పారు. వాస్తవానికి ఉక్రెయిన్‌పై యుద్దానికి ముందు నుంచే వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం బాగాలేదని తెలుస్తోంది.
రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు కూడా పుతిన్ అనారోగ్యం గురించి ధ్రువీకరించారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని, ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటనకు ముందు ఇది చోటు చేసుకుందని తెలిపారు. ఆయనకు పుతిన్‌తో సన్నిహిత సంబంధం ఉంది. ఇక,పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని క్రిస్టోఫర్ చెబుతున్న మాటల్ని ఇంకా రష్యా ప్రభుత్వ అధికారులెవరూ ధృవీకరించలేదు.
కాగా, గత నెలలో పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి రష్యాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ 'ప్రొయెక్ట్' ప్రచురించిన కథనం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2016 నుంచి థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, దానికి చికిత్స చేయించుకునేందుకే కొన్నిసార్లు అజ్ఞాతంలోకి వెళ్లారని ఆ కథనం తెలిపింది. చికిత్సలో భాగంగా ఎర్ర జింక కొమ్ముల నుంచి తీసిన రసంతో పుతిన్ స్నానం చేయాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. రష్యా అధ్యక్ష కార్యాలయ సర్జన్ తరచూ నల్ల సముద్రంలోని పుతిన్ నివాసానికి వెళ్లేవారని ఆ కథనంలో తెలిపింది. 2016 నవంబరులో అధ్యక్ష ఆస్పత్రి వైద్యుల బృందం పుతిన్‌కు శస్త్రచికిత్స చేసి ఉండవచ్చని ప్రొయెక్ట్ కథనం తెలిపింది. ఈ వైద్యబృందంలో ఇద్దరు, ముగ్గురికి అవార్డులు, పదోన్నతులు లభించినట్లు వెల్లడించింది.
2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్ సర్జన్‌తోపాటు చాలామంది వైద్యులు నగరంలోని పుతిన్ నివాసానికి వెళ్లినట్లు తెలిపింది. పుతిన్ అధికారిక సందర్శనల తేదీలను, ఆయన కనిపించకుండా పోయిన రోజులు, స్థానిక హోటల్లో బస చేసిన వివరాలను ప్రొయెక్ట్ వెల్లడించింది. 2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టులు 166 రోజులు సోచి నగరంలోని పుతిన్ నివాసంలో గడిపినట్లు రికార్డుల్లో ఉందని ప్రొయెక్ట్ ఎడిటర్ తెలిపారు. అయితే పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారా లేక ఇతర అనారోగ్యంతో ఉన్నారా అనే విషయాన్ని ప్రొయెక్ట్ నేరుగా ప్రస్తావించలేదు. పుతిన్ రాజకీయాల్లో గత 23 ఏళ్లుగా ఉన్నా ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి పట్ల ప్రజలకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.