Home /News /international /

PUTIN TELLS UKRAINE RUSSIA HAS BARELY STARTED ITS ACTION PVN

Putin Warning To Ukraine : ఉక్రెయిన్ ప్రజలకు ఇక విషాదమే..పుతిన్ సంచలన వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్ ఫోటో)

రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్ ఫోటో)

Russia Warning To Ukraine :ఐదు నెలలుగా ఉక్రెయిన్​ తో జరుగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఐదు నెలలుగా కొనసాగుతోంది. యుద్ధం కారణంగా వేల మంది ఉక్రేనియన్లు దేశం విడిచి,పొరుగు దేశాలలో ఆశ్రయం పొందుతున్నారు.

ఇంకా చదవండి ...
    Russia Warning To Ukraine :ఐదు నెలలుగా ఉక్రెయిన్​ తో జరుగుతున్న యుద్ధంపై రష్యా(Russia-Ukraine War) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఐదు నెలలుగా కొనసాగుతోంది. యుద్ధం కారణంగా వేల మంది ఉక్రేనియన్లు దేశం విడిచి,పొరుగు దేశాలలో ఆశ్రయం పొందుతున్నారు. రష్యా దాడి.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా(Europe)లో అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. అయితే పుతిన్ మాత్రం ఇప్పటివరకు చూసింది ట్రైలరేనని,తమ నిబంధనలను ఉక్రెయిన్ అంగీకరించకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాని తాజాగా హెచ్చరించారు. యుద్ధభూమిలో మాస్కో సేనలు ఇంకా తమ అసలైన చర్యను ప్రారంభించలేదని..ఇప్పటివరకు జరిగింది ఓ ట్రయిల్ మాత్రమేనని పుతిన్ తెలిపారు. 'ఉక్రెయిన్(Ukraine) ప్రజలకు ఇది విషాదం లాంటిదే కానీ, ప్రస్తుత పరిణామాలు ఈ దిశగానే వెళ్తున్నట్లు కనిపిస్తోందని గురువారం పార్లమెంట్ నేతలతో మీటింగ్ సందర్భంగా పుతిన్ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.

    "ఎక్కువగా చెప్పాలంటే మేము ఇంకా ఏదీ కూడా తీవ్రంగా ప్రారంభించలేదని అందరూ తెలుసుకోవాలి" అని పుతిన్ అన్నారు. పశ్చిమ దేశాలు శత్రుత్వానికి ఆజ్యం పోస్తున్నాయిని పుతిన్‌ ఆరోపించారు. యుద్ధం ముగింపు కోసం తాను చర్చలు జరిపేందుకు సిద్ధమేనన్నారు. అయితే ఆలస్యం అయ్యే కొద్దీ తమతో ఒప్పందం చేసుకోవడం వారికి మరింత కష్టమవుతుంది అని పుతిన్ హెచ్చరించారు.

    Elon Musk-Twitter Deal : ట్విట్టర్ కు ఎలాన్ మస్క్ బిగ్ షాక్..44 బిలియన్ డాలర్ల డీల్ రద్దు

    మరోవైపు,ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను "ఎకనామిక్ వార్" రష్యా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పలు దేశాలు రష్యా, అలాగే రష్యన్ బిలియనీర్లకు చెందిన ఆస్తులను జప్తు చేశాయి. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రష్యా.. అమెరికాకు ఇదే విషయంలో వార్నింగ్ ఇచ్చింది. అమెరికా కనుక ఉక్రెయిన్ యుద్ధాన్ని కారణంగా చూపించి రష్యాకు చెందిన ఆస్తులను స్తంభింపచేసినా, జప్తు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ హెచ్చరించారు. అమెరికా కనుక అలాంటి చర్యలు తీసుకుంటే అలస్కాను తాము తిరిగి లాగేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ప్రస్తుత అమెరికా రాష్ట్రమైన అలస్కాలో గతంలో రష్యన్ కాలనీలు ఉండేవి, అయితే ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ ప్రాంతాన్ని అమెరికాకు అమ్మేయడం జరిగింది. తమకు 1867లో కేవలం 7.2 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించి అలస్కాను కొనేసింది అమెరికా.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

    తదుపరి వార్తలు