Putin mission unfinished in Ukraine : ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై 100 రోజులు పూర్తైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది రష్యా. అయితే యుద్ధం మొదలై 100 రోజులు గడిచినా పెద్ద విజయాన్ని సాధించలేకపోయిన రష్యా సైన్యం. సులువైన విజయాన్ని మాస్కో అంచనా వేసినా.. సన్నద్ధత లేకపోవడం, పేలవమైన ప్రణాళిక, పుతిన్ సైనిక చర్యను ప్రభావితం చేసి ఉండవచ్చని చెబుతున్నారు నిపుణులు
రష్యన్ మిలిటరీ తక్కువగా ఉందా?
ఎక్కువ ఆయుధాలను ఉపయోగించి చిన్న, అధిక తీవ్రత కలిగిన పోరాటాలకు రష్యా సైన్యం సరిపోతుంది అని అంటారు. ఎక్కువ గ్రౌండ్ ఫోర్స్ అవసరమైన స్థిరమైన ఆక్రమణ కోసం రష్యన్ సైన్యం తగినంతగా సిద్ధం కాలేదని కొందరి నిపుణుల వాదన.ఉక్రెయిన్‌లో ఎదుర్కొన్న అనేక పరిస్థితులకు రష్యన్ మిలిటరీకి తగినంత తేలికపాటి పదాతిదళ బలగాలు లేవని చెబుతున్నారు విశ్లేషకులు. పదాతి దళం కొరత కారణంగా మాస్కో వైమానిక యూనిట్లు భారీ నష్టాలను అనుభవిస్తున్నాయని పేర్కొంటున్నారు నిపుణులు. రష్యన్ బెటాలియన్లు 2/3 లేదా 3/4 బలంతో మాత్రమే కనిపిస్తున్నాయని, కేవలం 230 నుంచి 280 మంది సైనికులు మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. యుద్ధభూమిలో ప్రస్తుత బలగాలను సర్దుబాటు చేయడానికి లేదా రొటేట్ చేయడానికి రష్యాకు మాన్‌పవర్ లేదని నిపుణులు అంటున్నారు. పాక్షిక సమీకరణ దళం ఏర్పడటం కూడా ఉక్రెయిన్‌లో రష్యన్ సైన్యం అవకాశాలను దెబ్బతీసిందని సమాచారం.
ALSO READ EU bans Russia oil imports: రష్యాకి ఈయూ బిగ్ షాక్..ఆయిల్ దిగుమతిపై బ్యాన్
రష్యన్ బెటాలియన్ వ్యూహాత్మక సమూహాలు
2016 నుండి, ప్రతి రెజిమెంట్ లేదా బ్రిగేడ్ కేవలం అధికారులు మరియు కాంట్రాక్ట్ సైనికులతో రెండు బెటాలియన్ వ్యూహాత్మక సమూహాలను ఏర్పాటు చేయవలసి ఉంది.
* రష్యన్ బెటాలియన్ ట్యాక్టిక్ గ్రూప్స్
2016 - 66
2017 - 115
2018 - 126
2019 - 136
ఆగస్ట్ 2021 - 168
రష్యా బెటాలియన్ ట్యాక్టిక్ గ్రూప్స్ ప్రస్తుత పరిమాణం, కూర్పు సరికాదని నిపుణులు తెలిపారు. 125 నుంచి 130 బెటాలియన్ ట్యాక్టిక్ గ్రూప్స్ రష్యా పేర్కొన్న బలం కంటే తక్కువని అభిప్రాయపడ్డారు నిపుణులు. మోటరైజ్డ్ రైఫిల్ కంపెనీకి కొత్త అధీకృత బలం 101 లేదా 113కి బదులుగా 75-76గా ఉందని, 32కి 22 ప్లాటూన్ బృందాలు ఉన్నట్లు అంచనా.
వ్యూహాత్మక లోపాలు రష్యా ‘మిషన్ కీవ్’ని దెబ్బతీశాయా?
రష్యన్ దళాలకు మోటరైజ్డ్ రైఫిల్ పదాతిదళం, డిస్‌మౌంటెడ్ యూనిట్ల కాకుండా ఆర్టిలరీ, ఆర్మర్, సపోర్ట్, ఎనేబ్లెర్స్ ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో పోరాడుతున్న ట్యాంక్ యూనిట్‌లకు, భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పదాతిదళ సపోర్ట్ కీలకం. ఎక్కువ సాయుధ వాహనాలు, యూనిట్లలో తక్కువ మంది సైనికులు ఉండటంతోనే రష్యన్ సైనిక వాహనాలను విడిచిపెట్టాయి దళాలు. మోటరైజ్డ్ రైఫిల్ దళాల కొరత ఉక్రెయిన్ ఆకస్మిక దాడికి గురయ్యే రష్యన్ ట్యాంక్ యూనిట్ల పేలవమైన పనితీరుకు కారణం. ఇందుకే పట్టణ భూభాగంలో పోరాటడానికి, డిస్‌మౌంటెడ్ యూనిట్‌లకు సపోర్ట్ చేయడానికి కష్టపడింది రష్యా. నాన్-కమిషన్డ్ ఆఫీసర్స్ లేకపోవడం కూడా రష్యా సైన్యం బలహీనత అని చెబుతున్నారు కొందరు నిపుణులు
మిలిటరీ నిర్మాణ లోపాలు పుతిన్ దాడిని స్తంభింపజేయా?
ఉక్రెయిన్‌లో పుతిన్ లక్ష్యాలను సాధించడంలో జాప్యానికి రష్యా సైనిక నిర్మాణం కొంతవరకు కారణమని అంటున్నారు నిపుణులు. సోవియట్ యూనియన్ పతనం నుంచి భారీ సైన్యం సమీకరణను విడిచిపెట్టే ప్రయత్నం చేసిన రష్యన్ సైనిక సంస్కరణలు
ఒక బలమైన ప్రత్యర్థిపై యుద్ధానికి బలం చాలా తక్కువగా ఉండటంతో 2013లో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు పుతిన్. ఎక్కువ బలగాలు, సామగ్రి ఉండాలనే ఆశతో, సిబ్బంది, ఖర్చు తగ్గించేందుకు పాక్షిక-సమీకరణ దళాన్ని ఆశ్రయించిన రష్యా. చివరికి వ్యూహాత్మక సమూహాలుగా మోహరించే బెటాలియన్ ట్యాక్టికల్ గ్రూప్స్‌ను స్వీకరించిన ఆధునిక రష్యా సైన్యం. యూఎస్ తరహాలో నాన్-కమిషన్డ్, జూనియర్ ఆఫీసర్లను సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించని రష్యా. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం చాలా పేలవంగా పనిచేయడానికి ప్రతినిధి బృందం లేకపోవడం కూడా కారణమంటున్నారు నిపుణులు. ఉన్నతాధికారులు ఫ్రంట్ లైన్స్‌ను తరచూ పరిశీలించాల్సి ఉంటుంది, దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో జనరల్స్ కోల్పోతున్న రష్యా.
పుతిన్ నష్టాలను ఎలా భర్తీ చేస్తున్నారు?
మోటరైజ్డ్ రైఫిల్ యూనిట్లలో ఈ పదాతిదళ కొరతను రష్యా తన నౌకాదళ పదాతిదళంతో భర్తీ చేస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. తేలికపాటి పదాతిదళ పాత్రలో పనిచేయడానికి రష్యాకి చెందిన నేషనల్ గార్డ్ లేదా రోస్గ్వార్డియా నుంచి యూనిట్ల తరలింపు మొదలైందని సమాచారం. వేర్పాటువాద మిలీషియా దళాలను కూడా ఉపయోగిస్తున్న మాస్కో, ఈ దళాలే మారియుపోల్‌లో జరిగిన పోరాటంలో కీలకంగా మారినట్లు సమాచారం. డోనెట్స్క్, లుహాన్స్క్ నుంచి సమీకరించిన మిలీషియా యోధులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించిన రష్యా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin