తన చర్యల ద్వారా, నిర్ణయాల ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరచిన పుతిన్ గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చించుకొంటున్నారు. అమెరికా, యూరప్, ఇతర దేశాల ఆంక్షలకు సైతం వెరవకుండా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న స్థాయి ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి.. రష్యా అధ్యక్ష పీఠానికి చేరిన పుతిన్ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన కుటుంబం గురించి ఎవరికీ స్పష్టమైన వివరాలు తెలియవు. కుటుంబానికి(Family) సంబంధించిన ప్రశ్నలు మీడియా సమావేశాల్లో ఎదురైనా పుతిన్ వివరాలు వెల్లడించకుండా జాగ్రత్త పడతారు. 2015లో జరిగిన పెద్ద మీడియా సమావేశంలో కూడా ఆయన కుమార్తె గురించి అడిగిన ప్రశ్నలకు పుతిన్ సమాధానం చెప్పకుండా దాటవేశారు.
ఆయన ఆ సమావేశంలో మాట్లాడుతూ.. ‘నా కూతుర్లు రష్యాలో నివసిస్తున్నారు. రష్యాలో మాత్రమే చదువుకున్నారు. నేను వారి గురించి గర్వపడుతున్నాను. వారు మూడు విదేశీ భాషలు అనర్గళంగా మాట్లాడతారు. నా కుటుంబం గురించి నేను ఎవరితోనూ చర్చించను. ప్రతి ఒక్కరికి తమకు ఇష్టం వచ్చినట్లు బతికే హక్కు ఉంది. సొంత జీవితాన్ని వారు గౌరవంగా భావిస్తారు.’ అని చెప్పారు.
వివరాలు బయటపెట్టిన అమెరికా
పుతిన్ తన కుమార్తెల వివరాలు బయటపెట్టడానికి ఇష్టపడి ఉండకపోవచ్చు. కానీ ఇతరులు వివరాలను బయటపెట్టారు. ఇటీవల యూఎస్ విధించిన ఆంక్షల్లో పుతిన్ కుమార్తెలు మరియా వొరంత్సోవా(36), కాటెరినా టిఖోనోవా(35) లక్ష్యంగా మారారు. పుతిన్ ఆస్తులు చాలా వరకు కుటుంబ సభ్యుల వద్ద దాచి ఉంచారని, అందుకే వారిని లక్ష్యంగా చేసుకున్నామని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అధ్యక్షుడు పుతిన్ కుటుంబ జీవితం గురించి అధికారికంగా చాలా తక్కువగా తెలిసినా.. కొన్ని పత్రాలు, మీడియా నివేదికలు, అప్పుడప్పుడు బహిరంగ ప్రకటనల ద్వారా కొంత సమాచారం తెలిసింది.
PM Modi: ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణ.. భాజపా ఎన్నికల ప్రచార అస్త్రం ఇదే..!
మరియా వొరంత్సోవా, కాటెరినా టిఖోనోవా పుతిన్, అతని మాజీ భార్య లియుడ్మిలా కుమార్తెలు. లియుడ్మిలా ఫ్లైట్ అటెండెంట్‌గా పని చేస్తున్న సమయంలో, పుతిన్ KGB ఆఫీసర్‌గా ఉన్నప్పుడు.. 1983లో వివాహం చేసుకున్నారు. వారి వివాహ జీవితం 30 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ క్రమంలోనే పుతిన్ రష్యా రాజకీయ వ్యవస్థలో అగ్రస్థానానికి చేరుకున్నారు. పుతిన్,లియుడ్మిలా 2013లో విడిపోయారు. ఈ సందర్భంగా లియుడ్మిలా మాట్లాడుతూ.. ‘ఇది ఉమ్మడి నిర్ణయం. మేము ఒకరినొకరు చూడలేము. మనలో ప్రతి ఒక్కరికి సొంత జీవితం ఉంటుంది. అతను పూర్తిగా పనిలో మునిగిపోయాడు.’ అని చెప్పారు.
వీరి పెద్ద కుమార్తె మరియా వొరోంట్సోవా 1985లో జన్మించింది. ఆమె సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో బయాలజీ, మాస్కో స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదివింది. మరియా వొరంత్సోవా ఇప్పుడు ఒక విద్యావేత్త. ఎండోక్రైన్ సిస్టమ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. పిల్లలలో ఎదుగుదల లేకపోవడంపై ఒక పుస్తకాన్ని సహ రచన చేశారు. మాస్కోలోని ఎండోక్రినాలజీ రీసెర్చ్ సెంటర్‌లో పరిశోధకురాలిగా కూడా ఉన్నారు. డచ్ వ్యాపారవేత్త జోరిట్ జూస్ట్ ఫాసెన్‌ను వివాహం చేసుకున్నారు. అతను ఒకప్పుడు రష్యన్ స్టేట్ ఎనర్జీ దిగ్గజం గాజ్‌ప్రోమ్‌లో పనిచేశాడు. అయినా వారు విడిపోయారు. ఉక్రెయిన్ దండయాత్ర నుంచి ఆమెతో మాట్లాడిన వ్యక్తులు ఆమె తన తండ్రికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారాలపై సందేహాలు వ్యక్తం చేశారని తెలిపారు.
ఈమెతో పోలిస్తే సోదరి కాటెరినా టిఖోనోవా.. రాక్ ఎన్ రోల్ డాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. 2013లో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్‌లో ఆమె, ఆమె భాగస్వామి ఐదో స్థానంలో నిలిచారు. అదే సంవత్సరం ఆమె అధ్యక్షుడు పుతిన్ చిరకాల స్నేహితుడి కుమారుడు కిరిల్ షమలోవ్‌ను వివాహం చేసుకుంది. వారి వివాహం సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని ప్రత్యేకమైన స్కీ రిసార్ట్‌లో జరిగింది. మూడు తెల్ల గుర్రాలు లాగిన పల్లకీపై దంపతులు వచ్చారని అక్కడి కార్మికులు తెలిపారు.
రష్యా ఇంధన రంగంలో షమలోవ్ పాత్రపై యూఎస్ 2018లో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత షమలోవ్ అదృష్టం బాగా మెరుగుపడిందని US ట్రెజరీ పేర్కొంది. అప్పటి నుండి ఈ జంట విడిపోయింది.
ఉక్రెయిన్ దండయాత్ర తరువాత బియారిట్జ్‌లోని మిస్టర్ షామలోవ్ యాజమాన్యంలోని విలాసవంతమైన విల్లాను ఆక్రమించినందుకు ఇద్దరు రష్యన్ కార్యకర్తలు అరెస్టు అయ్యారు. టిఖోనోవా ఇప్పుడు విద్యా రంగం, వ్యాపారంలో ఉన్నారు. ఆమె న్యూరోటెక్నాలజీ గురించి 2018 లో మీడియాతో మాట్లాడారు. 2021లో జరిగిన బిజినెస్ ఫోరమ్‌లో కూడా పపాల్గొన్నారు. ఏ సందర్భాలలోనూ ప్రెసిడెంట్‌తో ఆమె సంబంధం గురించి బయటపెట్టలేదు.
పుతిన్‌కు మనవళ్లు కూడా ఉన్నారు. 2017లో ఒక ఫోన్ ఇన్‌లో పుతిన్ మనవళ్ల ప్రస్తావన తెచ్చారు. ఎంత మంది అనే వివరాలు చెప్పలేదు. ఈ సందర్భంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘మా మనవళ్ల విషయానికొస్తే, ఒకరు ఇప్పటికే నర్సరీ స్కూల్‌లో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, వారు ఏదో ఒక రకమైన రాజకుమారుల్లా ఎదగడం నాకు ఇష్టం లేదు. వారు సాధారణ వ్యక్తుల్లా ఎదగాలని నేను కోరుకుంటున్నాను’ అని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Daughters, President, Russia, Vladimir Putin