Home /News /international /

PUTIN EXPANDS FAST TRACK RUSSIAN CITIZENSHIP TO ALL OF UKRAINE PVN

Putin : ఉక్రెయిన్ ని రష్యాలో కలిపేసుకునేలా పుతిన్ బిగ్ స్కెచ్

రష్యా-ఉక్రెయిన్ అధ్యక్షులు(ఫైల్ ఫొటో)

రష్యా-ఉక్రెయిన్ అధ్యక్షులు(ఫైల్ ఫొటో)

Russian Citizenship For Ukraines : రష్యా, ఉక్రెయిన్​ వార్​ ప్రారంభమై 139 రోజులవుతోంది. ప్రపంచం అంతా అక్కడ ఏం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. ఆ రెండు దేశాల యుద్ధంతో పలు దేశాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకవైపు చమురు, వంట నూనెల దిగుమతులు లేక ధరలు పెరుగుతుంటే.. మరోవైపు న్యూస్​ ప్రింట్​, ఎలక్ట్రానిక్స్​ వంటి గ్యాడ్జెట్స్​ ముడి పదార్థాల తయారీపై చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇంకా చదవండి ...
  Russian Citizenship For Ukraines : రష్యా, ఉక్రెయిన్​ వార్(Russia-Ukraine War)​ ప్రారంభమై 139 రోజులవుతోంది. ప్రపంచం అంతా అక్కడ ఏం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. ఆ రెండు దేశాల యుద్ధంతో పలు దేశాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకవైపు చమురు, వంట నూనెల దిగుమతులు లేక ధరలు పెరుగుతుంటే.. మరోవైపు న్యూస్​ ప్రింట్​, ఎలక్ట్రానిక్స్​ వంటి గ్యాడ్జెట్స్​ ముడి పదార్థాల తయారీపై చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక, తూర్పు ఉక్రెయిన్‌ దిశగా దాడులకు దిగుతున్న రష్యా(Russia) దాదాపు చాలా ప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకుంది. రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్‌ ప్రాంతంలోని లుహాన్‌స్క్‌ ప్రావిన్సుపై పట్టు సాధించాయి రష్యా బలగాలు. అయితే తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఉక్రెయిన్‌ పౌరులందరికి రష్యన్‌ ఫెడరేషన్‌ పౌరసత్వానికి(Russia Citizenship) దరఖాస్తు చేసుకునే హక్కు ఇచ్చేలా డిక్రీని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉక్రెయిన్ పౌరులకు వేగంగా రష్యా పౌరసత్వం పొందడానికి వీలు కల్పించే ఉత్తర్వుపై సోమవారం పుతిన్ సంతకం చేశారు. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం మొదలైనట్లయింది.

  ఇప్పటి దాకా ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్‌స్క్‌, జపోరిజిజియా, ఖేర్సన్‌ ప్రాంతాల నుంచి వచ్చినవారికే సులభతర విధానంలో రష్యా పౌరసత్వం లభించేది. దాదాపు ఇవన్నీ రష్యా నియంత్రణలోనే ఉండేవి. తాజాగా ఉక్రెయిన్‌ మొత్తానికి ఈ విధానాన్ని వర్తింపజేయాలని పుతిన్‌ డిసైడ్ అయ్యారు. 2019లో ఈ విధానాన్ని రెండు ప్రాంతాల వారి కోసం ప్రారంభించగా ఈ ఏడాది మే నెలలో మరో రెండు ప్రాంతాలను చేర్చారు. దీంతో మాస్కో నియంత్రణలో ఉ‍న్న ప్రాంతాలలోని నివాసితులు, అధికారులు రష్యాలో భాగమవుతారు. మొత్తంమీద ఇప్పటివరకు దాదాపు 7.20 లక్షల మందికి రష్యా పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఉక్రెయిన్‌ జనాభాలో 18శాతం మంది వీటిని పొందారు.

  Work from home ఉద్యోగులకు గుడ్ న్యూస్..వర్క్ ఫ్రమ్ హోమ్ ని చట్టబద్దం చేసేలా ప్రత్యేక చట్టం  మరోవైపు,ఐదు నెలలుగా ఉక్రెయిన్​ తో జరుగుతున్న యుద్ధంపై రష్యా(Russia-Ukraine War)అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin) గత వారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఐదు నెలలుగా కొనసాగుతోంది. యుద్ధం కారణంగా వేల మంది ఉక్రేనియన్లు దేశం విడిచి,పొరుగు దేశాలలో ఆశ్రయం పొందుతున్నారు. రష్యా దాడి.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా(Europe)లో అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. అయితే పుతిన్ మాత్రం ఇప్పటివరకు చూసింది ట్రైలరేనని,తమ నిబంధనలను ఉక్రెయిన్ అంగీకరించకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాని తాజాగా హెచ్చరించారు. యుద్ధభూమిలో మాస్కో సేనలు ఇంకా తమ అసలైన చర్యను ప్రారంభించలేదని..ఇప్పటివరకు జరిగింది ఓ ట్రయిల్ మాత్రమేనని పుతిన్ తెలిపారు. 'ఉక్రెయిన్(Ukraine) ప్రజలకు ఇది విషాదం లాంటిదే కానీ, ప్రస్తుత పరిణామాలు ఈ దిశగానే వెళ్తున్నట్లు కనిపిస్తోందని గురువారం పార్లమెంట్ నేతలతో మీటింగ్ సందర్భంగా పుతిన్ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది. "ఎక్కువగా చెప్పాలంటే మేము ఇంకా ఏదీ కూడా తీవ్రంగా ప్రారంభించలేదని అందరూ తెలుసుకోవాలి" అని పుతిన్ అన్నారు. పశ్చిమ దేశాలు శత్రుత్వానికి ఆజ్యం పోస్తున్నాయిని పుతిన్‌ ఆరోపించారు. యుద్ధం ముగింపు కోసం తాను చర్చలు జరిపేందుకు సిద్ధమేనన్నారు. అయితే ఆలస్యం అయ్యే కొద్దీ తమతో ఒప్పందం చేసుకోవడం వారికి మరింత కష్టమవుతుంది అని పుతిన్ హెచ్చరించారు.
  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

  తదుపరి వార్తలు