PUTIN APPOINTS A WELL KNOWN BOMBARDIER TO COMMAND THE RUSSIAN ARMY IN UKRAINE PVN
Russia-Ukraine War : వ్యూహం మార్చిన పుతిన్..ఇక భారీ విధ్వంసమే!..మే-9 లాస్ట్ డేట్!
అలెగ్జాండర్ డ్వోర్నికోవ్ ను రంగంలోకి దించిన పుతిన్
Rutin Key Decession : కీవ్ ను రష్యా బలగాలు చుట్టిముట్టిన వేళ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుద్ధభూమి ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఆదివారం రాజధాని కీవ్ వీధుల్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి కీవ్ వీధుల్లో తిరిగారు.
ఈ ఏడాది పిబ్రవరి చివర్లో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని కొనసాగిస్తోంది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 45 రోజులకు పైగా జరుగుతున్న ఈ యుద్దంలో వేల సంఖ్యలో సామాన్య పౌరులపై పాటు ఇరు వర్గాల సైనికులు కూడా భారీగానే చనిపోయారు. ముఖ్యంగా రష్యా తీవ్రంగా నష్టపోయింది. ఉక్రెయిన్ లో తొమ్మిది మంది రష్యా సైనిక జనరల్స్ మరణించారు. యుద్ధంలో భారీగా సైనికులను కోల్పోయినట్లు అంగీకరించింది రష్యా. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తాజాగా ఓ ఛానల్ తో మాట్లాడుతూ.. భారీ స్థాయిలో దళాల్ని కోల్పోయామని, ఇది విషాదకరమని అన్నారు. అయితే త్వరలోనే తమ యుద్ధ లక్ష్యాలను అందుకోనున్నట్లు ఆయన చెప్పారు.
అయితే ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ ను స్వాధీనం చేసుకోవడంలో పుతిన్ సైన్యం విఫలమైంది. యుద్ధం మొదలై దాదాపు నెలన్నర గడిచినా కీలకమైన ఈ నగరాన్ని చేజిక్కించుకోలేక వెనుతిరిగిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం మార్చారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మొత్తంగా పర్యవేక్షించేందుకు రష్యా ఏ కమాండర్ ను నియమించలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న పుతిన్..ఉక్రెయిన్ లో యుద్ధాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ జనరల్ అలెగ్జాండర్ డ్వోర్నికోవ్ ను రంగంలోకి దించారు. సిరియాలో రష్యా ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఆయనని ఇప్పుడు ఉక్రెయిన్ పై యుద్ధానికి చీఫ్‌గా నియమించారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో విజయమే టార్గెట్‌గా అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను పుతిన్ నియమించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ పై మరింత తీవ్రమైన దాడులకు పాల్పడాలనే వ్యూహంతో రష్యా ఈ నియామకం చేపట్టిందని యూరోపియన్ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు,రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా మే 9న రష్యాలో విజయ దినోత్సవాలను జరుపుకుంటారు. దీంతో ఆ తేదీలోగా ఉక్రెయిన్ పై విజయం సాధించాలనే లక్ష్యంతోనే పుతిన్ వ్యూహాలు మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై చేస్తున్న భీకర దాడులు ఆదివారం తీవ్రంగా మారాయి. పలు ఉక్రెయిన్ పట్టణాలపై రష్యా వైమానిక దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌కు చెందిన క్షిపణి నిరోధక వ్యవస్థను నాశనం చేసినట్లు రష్యా ప్రకటించింది. దినిప్రోపెత్రోవ్స్క్లోని ఎయిర్‌పోర్టుతో పాటు మైకోలైవ్, ఖార్కీవ్ ప్రాంతాల్లో క్షిపణి దాడులు చేసినట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. బెటాలియన్ హెడ్‌క్వార్టర్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ లాంచర్లను ధ్వంసం చేశామని తెలిపింది. అలాగే సాయుధ వాహనాల కాన్వాయ్‌ను మాస్కో వైమానిక దళాలు ధ్వంసం చేశాయని రష్యా మీడియా పేర్కొంది.
ఖర్కివ్ రీజియన్ లోని పలు ప్రాంతాల్లో 66 ఫిరంగి దాడులు జరిగాయని స్థానిక గవర్నర్ ఆరోపించారు. తూర్పు ఉక్రెయిన్ లోని వెల్కీ బర్లుక్ నగరం గుండా దాదాపు 13 కి.మీ. మేర రష్యా మిలటరీ కాన్వాయ్ దక్షిణం వైపు బయల్దేరింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ విడుదల చేసింది. ఈ కాన్వాయ్‌లో సాయుధ వాహనాలు, ఫిరంగులతో కూడిన ట్రక్కు లు, ఇతర ఆయుధ సామగ్రి ఉన్నాయని తెలిపింది. కీవ్ ను చుట్టుముట్టే వ్యూహంలో భాగంగా దాని సమీప ప్రాంతమైన బోరోడియంకా ప్రాంతాన్ని రష్యా అధీనంలోకి తెచ్చుకున్నట్లు.. స్థానిక అధికారులు తెలిపారు.
కీవ్ ను రష్యా బలగాలు చుట్టిముట్టిన వేళ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుద్ధభూమి ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఆదివారం రాజధాని కీవ్ వీధుల్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి కీవ్ వీధుల్లో తిరిగారు. పటిష్ట భద్రత నడుమ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి వీధుల్లో తిరుగుతుండగా.. ఓ పౌరుడు బోరిస్ ను కలిశారు. ఆపత్కాలంలో దేశ పర్యటనకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిగా మీకు సహాయం చేయడం మా అధృష్టంగా భావిస్తున్నామని బోరిస్ అన్నారు. మీకు అద్భుతమైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పారు. అతడు చాలాబాగా పనిచేస్తున్నాడని కితాబిచ్చారు. ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు కొనిగించాలని అనుకుంటున్నామని చెప్పారు. ఉక్రెయిన్ పౌరులకు ధైర్యాన్నిచ్చేందుకే తాను సర్ప్రైజ్ విజిట్ చేశానని బోరిస్ చెప్పారు. రష్యా విధ్వంసానికి బలవుతున్న దేశానికి అండగా నిలబడటం తమ విధి అని తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు మరింతగా ఆర్థిక, సైనిక సాయం అందిస్తామని ప్రకటించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.