పబ్‌జి గేమ్ ఆడుకోవడం కుదరట్లేదని.. భార్యాపిల్లలను వదిలేశాడు

పబ్‌జి గేమ్ ఎంత పాపులరో తెలిసిందే..ఈ గేమ్‌ను ఒకసారి ఆడి..ఆటను మరవలేక.. వ్యసనంగా మారిన ఉదంతాలను ఇంతకుముందు కూడా చూశాం.. తాజాగా..అలాంటిదే..ఒకటి కౌలాలంపూర్‌లో జరిగింది అయితే ఇది కాస్తా మోతాదు దాటింది.

news18-telugu
Updated: February 13, 2019, 5:18 AM IST
పబ్‌జి గేమ్ ఆడుకోవడం కుదరట్లేదని.. భార్యాపిల్లలను వదిలేశాడు
పబ్‌జి గేమ్ ఆడుకోవడం కుదరట్లేదని.. భార్యాపిల్లలను వదిలేశాడు
news18-telugu
Updated: February 13, 2019, 5:18 AM IST
పబ్‌జి గేమ్ ఎంత పాపులరో తెలిసిందే..ఈ గేమ్‌ను ఒకసారి ఆడి..ఆటను మరవలేక.. వ్యసనంగా మారిన ఉదంతాలను ఇంతకుముందు కూడా చూశాం.. తాజాగా..అలాంటిదే..ఒకటి కౌలాలంపూర్‌లో జరిగింది.  అయితే ఇది కాస్తా మోతాదు దాటింది. వివరాల్లోకి వేళ్తే.. మలేసియాకు చెందిన ఓ వ్యక్తి పబ్‌జి ఆటకు బానిసగా మారి నాలుగు నెలల గర్భిణిగా ఉన్న తన భార్యను, బిడ్డను వదిలేశాడు. పబ్‌జి ఆడేటప్పుుడు.. తనకు వారి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని తన భార్యకు, బిడ్డకు దూరంగా వెళ్లాడు. ఈ విషయాన్ని అతడి భార్య ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఆ ఫేస్‌బుక్ ఫోస్ట్ ప్రకారం.. ‘అతడు మమ్మల్ని వదిలి నెల రోజులు కావొస్తుంది. మొదట్లో ఈ ఆట ఆడే ముందు బాగానే మాతో ఉండేవాడు. కానీ ఒకసారి ఆడి.. దానికి బానిసగా మారి రాత్రిళ్లు నిద్రపోవడం కూడా మానేశాడు. పొద్దున్నే సరిగా లేచేవాడు కాదు. అంతేకాకుండా.. తన పనులు, వ్యాపారాన్ని పట్టించుకోవడం మానేశాడు. దానిపై నేను గట్టిగా మాట్లాడితే భర్తకు ఏ మాత్రం మద్దతు తెలపని భార్యగా నిందించేవాడు’ అని ఆమె ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలుపుతూ..భాదపడింది.

దీపికా పదుకొనే లేటెస్ట్ హాట్ ఫోటోస్


First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...