H-1B వీసాలతో జాబ్స్ చేస్తున్న భార్యల్ని జైలుకు పంపుతారా... నిర్ణయం తీసుకోనున్న ట్రంప్

H-1B Visa : మహిళలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రతిపాదన వల్ల టాలెంట్ ఉండి కూడా H1B వీసాలున్న భార్యలు అమెరికాలో జాబ్స్ వదులుకోవాల్సి వస్తుంది. లేదంటే జైలే గతి. దీనిపై ట్రంప్ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 22, 2019, 8:31 PM IST
H-1B వీసాలతో జాబ్స్ చేస్తున్న భార్యల్ని జైలుకు పంపుతారా... నిర్ణయం తీసుకోనున్న ట్రంప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
H-1B విదేశీ వర్కింగ్ వీసాల నిబంధనల్లో మార్పులు చేస్తూ... ప్రతిపాదిన డ్రాఫ్టును వైట్ హౌస్‌కి పంపారు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు. ఈ ప్రతిపాదనలు అమలైతే అమెరికాలోని H-1B వీసాలున్న 90,000 మంది విదేశీయులపై ప్రభావం చూపుతాయి. దీనిపై ట్రంప్ ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐతే... ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ... ఫెడరల్ కోర్టులో ఓ కేసు నమోదైంది. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. డ్రాఫ్ట్ రిపోర్టుపై ట్రంప్ వెంటనే నిర్ణయం తీసుకోరు. ముందుగా అందులో అంశాలపై వివిధ ఏజెన్సీల నుంచీ ఇన్‌పుట్స్ తెప్పించుకుంటారు. అందరూ సానుకూలంగా స్పందిస్తేనే దాన్ని ఆమోదించే అవకాశాలున్నాయి. ఇది మొత్తం జరగడానికి కొన్ని వారాలూ లేదా నెలలు పట్టొచ్చు. వైట్ హౌస్ నుంచీ అధికారిక ఉత్తర్వులు రాగానే... హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఆ ఉత్తర్వులను ఫెడరల్ రిజిస్టర్‌లో పొందుపరుస్తారు. తర్వాత వాటిని అమల్లోకి తెస్తారు. ఇందుకు 30 రోజుల సమయం ఉంటుంది.

ట్రంప్ మాత్రం H-1B వీసాలున్న భార్యలపై కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ జాబ్స్ చేస్తుంటే... ఇకపై భర్త ఒక్కరే అమెరికాలో జాబ్ చెయ్యాలనే నిబంధన తేవాలనుకుంటున్నారు. దీనిపై సెనెటర్ కమలా హ్యారిస్ సహా అమెరికా ప్రతినిధులు, సిలికాన్ వ్యాలీలో కంపెనీలు అభ్యంతరం చెబుతున్నాయి.

దీనిపై సేవ్ జాబ్స్ యూఎస్ఏ స్వచ్ఛంద సంస్థ అమెరికా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టులో 2018 సెప్టెంబర్‌లో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై ఆయా శాఖలు, హోంల్యాండ్ సెక్యూరిటీ తమ స్పందన తెలియజేయాలని కోరింది. ప్రస్తుతం ఈ కేసు ముగ్గురు జడ్జిల బెంచ్ (త్రిసభ్య ధర్మాసనం) ముందు ఉంది. ఆ ముగ్గురిలో ఒకరైన శ్రీ శ్రీనివాసన్ ఇండియన్ అమెరికన్. ఐతే, దీనిపై హోంల్యాండ్ సెక్యూరిటీ ఇంకా స్పందించలేదు. అమెరికాలో పాక్షిక షట్ డౌన్ అమల్లో ఉన్నందువల్ల నిర్ణయం తీసుకోవడంలో లేటవుతున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఈ సమాధానంపై సేవ్ జాబ్స్ సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసింది.


అమెరికాలో భార్యా, భర్తా ఇద్దరూ జాబ్స్ చేస్తేనే గానీ కుటుంబాన్ని నెట్టుకురాలేని పరిస్థితి ఉంటుంది. కొత్త రూల్ తెస్తే, ఇండియన్ అమెరికన్ మహిళలు తమ ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది. లేదంటే జైలుకెళ్లక తప్పదు. ఇది వాళ్లపై మాత్రమే కాదు... అక్కడి భారతీయ కుటుంబాలకూ సమస్యే.


ఇవి కూడా చదవండి :


మీ ఫొన్‌ను సింగిల్ హ్యాండ్‌తో పట్టుకుంటున్నారా... మీ జాతకం ఏంటంటే...


శనగపిండి షర్బత్ ట్రై చేశారా... ఎండాకాలంలో తాగాల్సిన డ్రింక్

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...

Published by: Krishna Kumar N
First published: February 22, 2019, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading