Home /News /international /

PRO RUSSIAN FEMALE SNIPER IN CUSTODY BY UKRAINIAN FORCES RECOGNIZED AS A DANGEROUS SNIPER WHO KILLED 40 PEOPLE GH VB

Russia-Ukraine: ఉక్రేనియన్ దళాల అదుపులో ప్రో-రష్యన్ మహిళా స్నిపర్.. ఆమె ఎంత డేంజర్ అంటే..

రష్యన్ స్నిప్పర్

రష్యన్ స్నిప్పర్

ఉక్రెయిన్ దళాలకు మహిళా ప్రో-రష్యన్ స్నిపర్ పట్టుబడ్డారు. పౌరులతో సహా మొత్తం 40 మంది ఉక్రేనియన్లను ఆమె చంపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బగీరా ​​అనే కోడ్ నేమ్ ఉన్న ఇరినా స్టారికోవాను యుద్ధభూమిలో గాయపడ్డ తర్వాత తోటి సైనికులు వదిలి వెళ్లారు.

ఇంకా చదవండి ...
ఉక్రెయిన్(Ukraine) దళాలకు మహిళా ప్రో-రష్యన్ స్నిపర్ పట్టుబడ్డారు. పౌరులతో సహా మొత్తం 40 మంది ఉక్రేనియన్లను ఆమె చంపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బగీరా ​​అనే కోడ్ నేమ్ ఉన్న ఇరినా స్టారికోవాను యుద్ధభూమిలో గాయపడ్డ తర్వాత తోటి సైనికులు(Soldiers) వదిలి వెళ్లారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈమె ఫోటోను పోస్ట్(Post) చేసిన ఉక్రెయిన్ సాయుధ దళాలు.. ఆమె 2014లో ఉక్రెయిన్ ఖైదీలను కాల్చి చంపిందని ప్రకటించారు. 40 మంది ఉక్రెయిన్ వాసులను చంపి, 100 మందిని హత్య చేసిన స్నిపర్‌ను స్టారికోవా పెళ్లి చేసుకున్నారు. ఇరినా స్టారికోవాది డోనెట్స్క్‌ ప్రాంతం. ఉక్రేనియన్ వేర్పాటువాద ప్రాంతంలోని డాన్‌బాస్‌లో ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. 2014 నుంచి వేర్పాటువాద డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ 'ఇంటెలిజెన్స్ యూనిట్'కి ఓగ్రెనిచ్ నాయకత్వం వహించారు. అలెగ్జాండర్ రష్యా అనుకూల వేర్పాటువాదుల కోసం పోరాడుతున్నాడని.. 100 మందికి పైగా ఉక్రేనియన్లను కాల్చి చంపాడని ఉక్రెయిన్ వర్గాలు గుర్తించాయి.

PM Modi: ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణ.. భాజపా ఎన్నికల ప్రచార అస్త్రం ఇదే..!

ఉక్రెయిన్ ప్రఖ్యాత స్నిపర్ 'వాలి'..
పట్టణ పరిస్థితులలో రష్యన్, ఉక్రేనియన్ దళాలు తలపడటంతో యుద్ధంలో స్నిపర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రష్యన్‌లతో పోరాడేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లినట్లు ప్రఖ్యాత కెనడియన్ స్నిపర్ వెల్లడించిన తర్వాత వార్తల్లో స్నిపర్లు నిలుస్తున్నారు. రష్యాపై ఉక్రెయిన్ చేస్తున్న పోరాటంలో విదేశీ వలంటీర్లు చేరాలని జెలెన్స్కీ పిలుపునివ్వగా.. వలి అనే మారుపేరు ఉన్న ఆ స్నిపర్‌కు జెలెన్స్కీ కాల్ చేశారు. జెలెన్‌స్కీ పిలుపు మేరకు భార్య, ఏడాది కూడా నిండని కుమారుడిని వదిలేసి.. వలి ఈ యుద్ధంలో పాల్గొంటున్నాడు. 40 ఏళ్ల ఈ వ్యక్తి గతంలో 2009- 2011 మధ్య కెనడియన్ సాయుధ దళాలతో కలిసి స్నిపర్‌గా ఆఫ్ఘనిస్తాన్‌కు రెండుసార్లు వెళ్లినట్లు వార్తలు. 2015లో ఐసిస్‌పై పోరాడేందుకు సొంతంగా వలి ఇరాక్‌కు వెళ్లారు.



ఆ బెటాలియన్‌లో అతను 3.5 కి.మీ. కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించి శత్రువులను చంపగలడు. 6,600 డాలర్ల విలువైన మిలిటరీ-గ్రేడ్ ..338 స్నిపర్ రైఫిల్‌తో తాను 1,531 గజాల పరిధిలో ఉన్నవారిని చంపగలనని స్నిపర్ పేర్కొన్నారు. ఇటీవల తాను చనిపోయినట్లు ప్రకటించిన రష్యా సైనికులను ఎగతాళి చేసిన వలి.. రష్యన్ దళాలు వెనక్కి వెళ్లినప్పుడు వదిలేసిన రేషన్‌తో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
Published by:Veera Babu
First published:

Tags: Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు