Home /News /international /

PRO KHALISTAN YOUTH VANDALISED MAHATMA GANDHI STATUE IN US WASHINGTON DC SU

Mahatma Gandhi Statue: అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్ర స్థాయిలో మండిపడ్డ భారత్

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న ఖలీస్థాన్ వేర్పాటువాదులు

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న ఖలీస్థాన్ వేర్పాటువాదులు

Mahatma Gandhi Statue అమెరికాలో ఖలీస్థానీ వేర్పాటువాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

    అమెరికాలో ఖలీస్థానీ వేర్పాటువాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ చర్యను భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని అమెరికాలోని స్థానిక భద్రతా వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపింది. వివరాలు.. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దుతగా అమెరికాలో సిక్కు యువకులు నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్ వాషింగ్టన్, మేరిలాండ్, వర్జీనియా, న్యూజెర్సీ, నార్త్ కరోలినాతో పాటుగా పలు రాష్ట్రాల్లో వందలాది మంది సిక్కులు నిరసనలు చేపట్టారు. శాంతియుత నిరసనల ద్వారా రైతులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే వారు వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయానికి కార్ల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భారత్‌లో నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీ భావం ప్రకటించారు. అయితే కొద్దిసేపటికే వారి శాంతియుత నిరసనల మధ్యలోకి ఖలిస్థాన్ వేర్పాటువాదులు చొరబడ్డారు. రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్థాన్ పేరిట భారత్‌కు వ్యతిరేక బ్యానర్లు, ఫ్లకార్డులు పట్టుకుని రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు గాంధీ విగ్రహం పైకి దూకారు. విగ్రహానికి పోస్టర్లు అంటించారు. తమ చేతుల్లో ఉన్న ఖలీస్థాన్ జెండాలను గాంధీ విగ్రహంపై కప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వేర్పాటు వాదులు భారత్‌కు వ్యతిరేకంగా, ఖలీస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారు.

    ఈ ఘటనను భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై యూఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల వద్ద తాము నిరసన వ్యక్తం చేశామని రాయబారా కార్యాలయం తెలిపింది. చట్టప్రకారం ముందస్తు విచారణ జరిపి, ఈ ఘటన వెనకు పాల్పడినవారిపై, కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక, అమెరికా సీక్రెట్ సర్వీసెస్, వాషింగ్టన్ డీసీ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉన్నారు. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో దానిని గమనించిన సీక్రెట్ సర్వీసెస్ అధికారులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు.

    ఇక, అమెరికాలో స్మారక చిహాల్ని, విగ్రహాల్ని నాశనం చేయడం గానీ, విధ్వంసం చేయడం గానీ, అపవిత్రం చేయడం గానీ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జూన్ 26వ తేదీన సంతకం చేశారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారికి కూడా ఈ ఆర్డర్ ప్రకారమే శిక్ష విధించనున్నారు.

    ఖలీస్థాన్ వేర్పాటు వాదులు దాడి చేసిన ఈ గాంధీ విగ్రహాన్ని 2000 సెప్టెంబర్ 16న అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ విగ్రహా ఏర్పాటుకు సంబంధించి యూఎస్ కాంగ్రెస్ 1998లో ఒక చట్టాన్ని ఆమోదించింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Khalistan, Mahatma Gandhi, USA, Washington

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు