హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

భార్య తనను కలిసేందుకు రావడం లేదని.. పురుషాంగాన్ని కట్ చేసుకున్న ఖైదీ

భార్య తనను కలిసేందుకు రావడం లేదని.. పురుషాంగాన్ని కట్ చేసుకున్న ఖైదీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జైలులో ఉన్న ఓ ఖైదీ తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడు. తన భార్య కాంజుగల్ విజిట్‌కు నిరాకరించడంతో అతను ఈ చర్యకు పాల్పడ్డాడు.

జైలులో ఉన్న ఓ ఖైదీ తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడు. భార్య తనతో సెక్స్ చేసేందుకు రాకపోవడంతో అతడు ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆ ఖైదీ భార్య క్రిస్మస్ పండగ సందర్భంగా కాంజుగల్ విజిట్‌(జైలులో ఉన్న ఖైదీలు తనను చూడటానికి వచ్చినవారితో ప్రైవేటుగా గడపటానికి, సెక్స్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతించే సమయం) తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నైరుతి స్పెయిన్‌లో ప్యూర్టో డీ శాంటా మారియాలోని పూర్టో 3 జైలులో ఉన్న ఓ ఖైదీ క్రిస్మస్ సందర్బంగా తన భార్యను కాంజుగల్ విజిట్‌కు ఆహ్వానించాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న సదురు ఖైదీ తీవ్ర నిరాశ చెందాడు. ఆవేశంలో తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడని యూకే వార్త పత్రిక డైలీ స్టార్ పేర్కొంది.

ఆ ఖైదీ ఉన్న గదిలో తీవ్ర రక్త స్రావాన్ని గుర్తించిన జైలు సిబ్బంది.. అతని చేసిన పని తెలసుకుని షాక్ తిన్నారు. వెంటనే అతన్ని జైలు హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్యులు అతని ప్రాణాలను కాపాడారు. అయితే అతను కట్ చేసుకున్న అవయవాన్ని తిరిగి జోడించగలిగారా? లేదా? అనే విషయంపై స్పష్టత రాలేదు.

అయితే ఖైదీ వివరాలు, అతను ఎందుకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడనే విషయాలు మాత్రం బహిర్గతం కాలేదు. మరోవైపు జైలులో ఉన్న ఖైదీ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు లోకల్ రిపోర్ట్స్‌ను ఉటంకిస్తూ డైలీ స్టార్ తెలిపింది.

First published:

Tags: Spain

ఉత్తమ కథలు