PRINCE WILLIAM AND KATE MIDDLETON MIGHT BE CALLING OFF THEIR VISIT TO PAKISTAN MK
ప్రిన్స్ విలియం దంపతుల పాకిస్థాన్ పర్యటన రద్దు అయ్యే అవకాశం...?
ప్రిన్స్ విలియం దంపతులు (ఫైల్ చిత్రం)
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజ దంపతుల పర్యటన గురించి పునరాలోచించే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ నుంచి వార్తలు వస్తున్నాయని ది న్యూస్ ఇంటర్నేషనల్ ఒక రిపోర్టులో పేర్కొంది.
బ్రిటన్ రాజవంశస్థులు ప్రిన్స్ విలియం దంపతులు తమ పాకిస్థాన్ అధికార పర్యటనను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజ దంపతుల పర్యటన గురించి పునరాలోచించే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ నుంచి వార్తలు వస్తున్నాయని ది న్యూస్ ఇంటర్నేషనల్ ఒక రిపోర్టులో పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రిన్స్ విలియం దంపతులు ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్ లో అధికారిక పర్యటన జరపబోతున్నారు. సాంప్రదాయం ప్రకారం శరత్ కాలంలో బ్రిటన్ రాచ దంపతులు విదేశీ పర్యటనలు చేపడతారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23 నుంచి డిసెంబర్ 22 మధ్య కాలంలో ప్రిన్స్ విలియం దంపతులు విదేశీ పర్యటనలు చేపడతారు. గతంలో క్వీన్ ఎలిజిబెత్ -2, ప్రిన్స్ చార్లెస్ పాకిస్థాన్ లో పర్యటించారు.
ఇదిలా ఉంటే ప్రిన్స్ విలియం దంపతులు పాకిస్థాన్ పర్యటన రద్దు అయితే మాత్రం ఆ రెండు దేశాల మధ్య సత్సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పాక్ విదేశాంగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.