G20 Summit : జీ20 సదస్సుకు ప్రధాని మోదీ... జపాన్‌తో బలపడుతున్న స్నేహ బంధం...

G20 Summit - Japan : రెండోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ పాల్గొన్న కీలక అంతర్జాతీయ సదస్సు ఇదే.

Krishna Kumar N | news18-telugu
Updated: June 28, 2019, 6:25 AM IST
G20 Summit : జీ20 సదస్సుకు ప్రధాని మోదీ... జపాన్‌తో బలపడుతున్న స్నేహ బంధం...
షింజో అబే, నరేంద్ర మోదీ (Image : Twitter / ANI)
  • Share this:
ఆర్థికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు, పెట్టుబడులకు ఎన్నో సానుకూల అంశాలున్న భారత్‌ను ప్రపంచ దేశాల ముందు మరింత సమర్థంగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జపాన్.. ఒసాకాలో జరుగుతున్న అంతర్జాతీయ జీ20 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అంతకుముందు మోదీ... జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన మోదీకి షింజే అబే శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత నేతలిద్దరూ... రెండు దేశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మొదటి నుంచీ భారత్ - జపాన్ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. షింజో అబేతో భేటీ తర్వాత ఈ సంబంధాలు మరింత బలపడాలని కోరుకున్నారు ప్రధాని మోదీ.


జీ20 సదస్సు కోసం బుధవారం రాత్రే భారత్‌ నుంచీ బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ... గురువారం జపాన్ చేరుకున్నారు. జీ 20 సమావేశం సందర్భంగా... అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌‌, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తోపాటూ కొంతమంది ఇతర దేశాల అధినేతలతో కూడా ప్రధాని భేటీ అయ్యే అవకాశాలున్నాయి. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ట్రంప్‌, పుతిన్‌తో సమావేశం కానుండటం ఇదే తొలిసారి. కాగా జీ-20 సదస్సులో అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలతో పాటూ... భారత్‌ ప్రపంచ దేశాలకు ఏ విధంగా ఆదర్శంగా నిలవబోతున్నదీ ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.
Published by: Krishna Kumar N
First published: June 28, 2019, 6:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading