• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • PRIME MINISTER JUSTIN TRUDEAU HAS NOMINATED INDIAN ORIGIN JUSTICE MAHMUD JAMAL TO THE SUPREME COURT OF CANADA MK GH

Indian origin Justice: కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి...

కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి...

కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మొట్టమొదటిసారి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. భారత మూలాలున్న జస్టిస్​ మహమూద్​ జమాల్​కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను సుప్రీం కోర్టు జడ్డిగా నియమిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు.

  • Share this:
కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మొట్టమొదటిసారి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. భారత మూలాలున్న జస్టిస్​ మహమూద్​ జమాల్​కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను సుప్రీం కోర్టు జడ్డిగా నియమిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. జమాల్​కు న్యాయ శాస్త్రంలో, వ్యవహారాల్లో చాలా అనుభవం ఉందని ట్రూడో కొనియాడారు. సుప్రీం కోర్టుకు చెందిన గొప్ప సంపదగా ఆయన నిలుస్తారని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కెనడీయన్లను కాకుండా మరో వర్ణానికి చెందిన వ్యక్తిని ఆ పదవికి నామినేట్​ చేయడం దేశ చరిత్రంలో ఇదే తొలిసారి. 146 ఏళ్లుగా కెనడా సుప్రీంకోర్టు జడ్జిలుగా తెల్లజాతీయులు మాత్రమే ఉన్నారు. కానీ, తొలిసారి కొత్త సాంప్రదాయానికి ప్రధాని జస్టిన్​ ట్రూడో నాంది పలికారు. జస్టిస్​ జమాల్​ను సుప్రీం కోర్టు జడ్జీగా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.​

మహమ్మద్​ జమాల్ 2019 నుంచి ఒంటారియో కోర్ట్​ ఆఫ్​ అప్పీల్​ జడ్జిగా కొనసాగుతున్నారు.​ ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టులో జరిగిన 35 కేసుల విచారణలో హాజరయ్యారు. దీంతో జస్టిస్​ జమాల్​ పనితీరును మెచ్చి సుప్రీంకోర్టుకు జడ్జిగా నామినేట్​ చేశారు. ఈ మేరకు ప్రధాని ట్రుడో ట్వీట్​ చేస్తూ ‘‘కెనడా సుప్రీం కోర్టు చరిత్రంలో ఇదో చారిత్రాత్మక ఘట్టం. సుప్రీంకోర్టుకు జస్టిస్​ మహమూద్​ జమాల్​ ఎంతో విలువైన ఆస్తి.. అందుకే, మనదేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఆయన్ను నామినేట్​ చేస్తూ నిర్ణయం తీసుకున్నా” అని పేర్కొన్నారు.

గుజరాత్​ మూలాలున్న వ్యక్తి..
మహమూద్​ జమాల్​ నామినేషన్​ను జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్​లోని హౌస్ ఆఫ్ కామన్స్ స్టాండింగ్ కమిటీ ఆమోదించాల్సి ఉంది. కానీ, ఇది ఫార్మాలిటీ మాత్రమే. జస్టిస్​ జమాల్​ కుటుంబానికి భారత్​లోని గుజరాత్ మూలాలు ఉండటం విశేషం. 1967లో నైరోబిలోని ఒక భారతీయ కుటుంబంలో ఆయన జన్మించారు. 1981లో కెనడాకు వెళ్లే వరకు బ్రిటన్​లో ఎదిగారు. ఆయన టొరంటో విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లాస్, బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లాలో డిగ్రీ పూర్తిచేశారు. మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో లా ఫ్యాకల్టీగా పనిచేశారు.

గతంలో తన పేరు, మతం, వర్ణం కారణంగా ఎన్నో సార్లు వేధింపులు, వివక్షలకు గురైనట్లు జమాల్​ తెలిపారు. అలా ఎన్నో వివక్షలు ఎదుర్కొన్న నేను ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా నామినేట్​ కావడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఇక, జస్టిన్​ ట్రూడో ప్రభుత్వంలో భారతీయులు కీలక పదవులను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం భారత సంతతికి చెందిన ఎంపీ మనీందర్​ సిద్ధూని ప్రధాని ట్రూడో కీలక పదవిలో నియమించారు. భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ కమల్​ ఖేరా, కరీనా గౌల్ట్​లను పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించారు.
Published by:Krishna Adithya
First published: