హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UAE: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూత..

UAE: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూత..

యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ అల్ నహ్యాన్

యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ అల్ నహ్యాన్

UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం మరణించినట్లు ఎమిరేట్ అధికారులు ప్రకటించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (sheikh khalifa bin zayed al nahyan)  మరణించినట్లు ఎమిరాటీ అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాగా,  1948లో షేక్ ఖలీఫా జన్మించారు. ఆయన తన తండ్రి షేక్ జాయెద్ అల్ నహ్యాన్ 1971లో సింహాసనాన్ని అధిష్టించారు. ఆ తర్వాత.. ఆయన చనిపోయారు. ఆయన తర్వాత.. నహ్యాన్ 2004లో యూఎఈకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

ప్రస్తుతం దేశ అధ్యక్షుడి అకాల మరణంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో..  దేశ పతాకాన్ని  సగం వరకు కిందకు దించి  అక్కడి  అధికారులు సంతాపం తెలపాలని ఆదేశాలు జారీచేశారు. 40 రోజుల పాటు అధికారికంగా సంతాపదినాలుగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం .. అబుదాబి యొక్క క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో డి- ఫాక్టర్ పాలకుడిగా కనిపించడంతో రోజువారీ వ్యవహారాల్లో పాల్గొనడాన్ని అల్ నహ్యాన్  మానేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: UAE

ఉత్తమ కథలు