Home /News /international /

Czech Republic: కరోనా సోకినా బయటకు వచ్చిన చెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్.. కొత్త ప్రధానితో ప్రమాణ స్వీకారం

Czech Republic: కరోనా సోకినా బయటకు వచ్చిన చెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్.. కొత్త ప్రధానితో ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం చేయిస్తున్న చెక్​ రిపబ్లిక్​ ప్రెసిడెంట్​ (photo: ashoswai/Twitter)

ప్రమాణ స్వీకారం చేయిస్తున్న చెక్​ రిపబ్లిక్​ ప్రెసిడెంట్​ (photo: ashoswai/Twitter)

కరోనా (Corona) సోకితే ఎవరైనా ఐసోలేషన్ లో ఉండాల్సిందే. ఇంటి నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. కానీ కోవిడ్ పాజిటివ్‌గా తేలినా కూడా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు

కరోనా (Corona) సోకితే ఎవరైనా ఐసోలేషన్ లో ఉండాల్సిందే. ఇంటి నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. కానీ కోవిడ్ పాజిటివ్‌గా తేలినా కూడా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు (Czech republic president) మిలోస్ జెమాన్ (Milos Zeman). ఇందుకు ఆయన ప్రత్యేకంగా ఓ ఐసోలేషన్ బాక్స్ ఏర్పాటు చేయించుకున్నారు. ఆదివారం చెక్ రిపబ్లిక్  (Czech Republic) సెంటర్ రైట్ అలయన్స్ నేత పీటర్ ఫియాల (Petr Fiala) దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. అధ్యక్షుడి సమక్షంలో ఈ వేడుక జరిగింది. అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో సెంటర్, సెంటర్ రైట్ పార్టీలు సమష్టిగా విజయం సాధించాయి. ఈ సంకీర్ణానికి పీటర్ నేతృత్వం వహిస్తున్నారు.

క్యూబికల్ బాక్స్ లో ..

ఆదివారం జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ( swearing-in ceremony) దేశాధ్యక్షుడు (Czech president)  మిలోస్ హాజరయ్యారు. పూర్తిగా పీపీఈ కిట్లను ధరించిన వైద్య సిబ్బంది ఆయన్ను వీల్ ఛైర్లో క్యూబికల్ బాక్స్ లోకి తీసుకొచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం (swearing-in ceremony) జరుగుతున్న గదిలో ఈ ఐసోలేషన్ బాక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ గాజు బాక్స్ నుంచే అధ్యక్షుడు (Czech president) జెమాన్.. నూతన ప్రధానితో ప్రమాణం చేయించారు. ఆరువారాల క్రితం గుర్తుతెలియని ఆనారోగ్య సమస్యలతో (health problems) ఆసుపత్రిలో చేరారు జెమాన్. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకింది.

పోలీసుల విచారణ..

అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి (former PM) ఆండ్రెజ్ బాబిస్ పార్టీ ప్రతిపక్షం చేతిలో పరాజయం పాలైంది. ఈ ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఆ దేశ అధ్యక్షుడు మెలోస్ జెమాన్ ఆసుపత్రి పాలయ్యారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఆయన చికిత్స అందించారు. అయితే అధ్యక్షుడి (president) అనారోగ్యం గురించి ఆయన సీనియర్ సహాయకులు దాచిపెట్టారని సెనెట్ రిపోర్ట్ ఇవ్వడంతో చెక్ పోలీసులు వారిపై విచారణ చేపట్టారు. కరోనా సోకినప్పటికీ అత్యవసరం కాబట్టి ప్రత్యేక ఏర్పాట్ల నడుమ కొత్త ప్రధాని (PM)తో అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయించారని అధికార వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు చెక్ రిపబ్లిక్ (Czech Republic) లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే ఇక్కడ వ్యాక్సినేషన్ (vaccination) రేటు కూడా తక్కువగా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో చెక్ రెండో స్థానంలో ఉంది. స్లోవేకియా మొదటి స్థానంలో ఉంది. ఆసుపత్రుల్లో పడకలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. చెక్ ఆరోగ్య మంత్రి ఆడం వోజ్ టెక్ కూడా కూడా మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ఐరోపాలో విలయతాండవం చేస్తోన్న మహమ్మారిని నియంత్రించేందుకు సదరు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. కర్ఫ్యూలు, షట్ డౌన్లను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే ఓమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఈ నూతన వేరియంట్ వ్యాపించక ముందే ఐరోపాలో కేసులు అధికంగా నమోదవుతుండటం గమనార్హం.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: International news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు