క్వీన్ ఎలిజబెత్ 2 సెప్టెంబరు 8 స్కాట్లాండ్ లో 96 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె అకాల మరణానికి అనేక దేశాధినేతలు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన నాయకులు ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కాగా, శనివారం సాయంత్రమే దేశ ప్రథమ పౌరురాలు లండన్ చేరుకున్నారు. కాగా, సోమవారంనాడు క్వీన్ ఎలిజబెత్ 2 కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. అధ్యక్షురాలు.. ద్రౌపది ముర్ము లండన్‌లోని లాంకాస్టర్ హౌస్‌లో తాత్కాలిక హైకమిషనర్ సుజిత్ ఘోష్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటికే దాదాపు 500 మంది ప్రపంచ నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకుటుంబ సభ్యులతో కలిసి దాదాపు 2,000 మందితో అబ్బేలో జరిగే వేడుకలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై దాదాపు రెండు నిమిషాల మౌనంతో ముగుస్తుంది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్, క్వీన్ కన్సార్ట్ కెమిల్లా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు అధ్యక్షుడిని ఆహ్వానించారు. "అధికారిక రాష్ట్ర కార్యక్రమం"గా వర్ణించబడింది. దీనికి అనేక దేశాల నుంచి దేశాధినేతలు, ప్రభుత్వ, అధికారిక విదేశీ అతిథులు వస్తున్నారు. కాగా, 2009, 2012 మధ్య క్వీన్స్ రాయల్ హౌస్‌హోల్డ్‌లో పనిచేసిన, రాచరికం గురించి విస్తృతంగా వ్రాసిన జాకీ కూపర్, రాణి "భారతదేశంతో ఆప్యాయతతో కూడిన సంబంధాన్ని" బలపర్చారని భావిస్తారు.
President Droupadi Murmu visited Westminster Hall London where the body of Her Majesty the Queen Elizabeth II is lying in state. The President offered tributes to the departed soul on her own behalf and on behalf of the people of India. pic.twitter.com/c1Qac7PhPd
— President of India (@rashtrapatibhvn) September 18, 2022
అదే విధంగా.. సామ్రాజ్యం నుండి కామన్వెల్త్కు మారడంలో కీలకపాత్ర పోషించారని నమ్ముతారు. అంత్యక్రియలకు ఆహ్వానించబడిన సందర్శకుల ప్రముఖులు, అతిథుల కోసం సోమవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు వెస్ట్ మినిస్టర్ లోని అబ్బేకి తలుపులు తెరవబడతాయి. అక్కడ క్వీన్ ఎలిజబెత్ 2 కి ప్రజలు, అధికారులు, దేశాధినేతలు, అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలను నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Britan, Draupadi Murmu, Queen Elizabeth II