గూగుల్‌పై మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

గూగుల్ సంస్థ అమెరికా మిలిటరీ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుంది తప్ప...చైనా మిలిటరీ ప్రయోజనాలకు కాదని సుందర్ పిచై తనతో అన్నట్లో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఆ సంస్థకు ఇబ్బందికరంగా మారింది. 

news18-telugu
Updated: March 28, 2019, 1:25 PM IST
గూగుల్‌పై మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • Share this:
గూగుల్ సంస్థ చైనాతో పాటు ఆ దేశ మిలిటరీకి సాయం చేస్తోందికానీ...అమెరికాకు కాదంటూ ఈ నెల మొదటి వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన గూగుల్ సీఈవో సుందర్ పిచైతో వైట్ హౌస్‌లో బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం గూగుల్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ స్వరంలో మార్పు వచ్చింది. గూగుల్ సంస్థ అమెరికా మిలిటరీ ప్రయోజనాలకు కట్టుబడి ఉందని, చైనా మిలిటరీకి కాదని సుందర్ పిచై అన్నట్లు ట్రంప్ వెల్లడించారు. అలాగే దేశం కోసం గూగుల్ ఏమేమి చేయగలదన్న అంశాలపై సుందర్ పిచైతో చర్చ జరిగిందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

#MeToo Movement, Me too Movement In India, Sexual harassment on women, Tanusree dutta Comments on Nana Patekar, మీటూ మూమెంట్ ఇండియా, సెక్సువల్ హారాస్‌మెంట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మీటూ కామెంట్స్, Google CEO Sundar Pichai Comments on Me too movement
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్


అయితే ట్రంప్‌తో భేటీ అనంతరం సుందర్ పిచై ఎలాంటి ట్వీట్ చేయలేదు. అయితే ట్రంప్‌తో గూగుల్ సీఈవో పిచై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. గూగుల్ సంస్థ అమెరికా మిలిటరీ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుంది తప్ప...చైనా మిలిటరీ ప్రయోజనాలకు కాదని సుందర్ పిచై తనతో అన్నట్లో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఆ సంస్థకు ఇబ్బందికరంగా మారింది.
First published: March 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>