సముద్రాలు ఎన్నో వింతలు విశేషాలకు నిలయాలుగా ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని సముద్ర జీవాలు అప్పుడప్పుడూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాయి. వింతైన ఆకారంలో గల చేపలను చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఓ అరుదైన చేప పసిఫిక్ తీరం (Pacific Ocean) లోని జాలర్లకు చిక్కింది. దాని నోటిలో ఏకంగా 555 పదునైన దంతాలు ఉండటాన్ని చూసి జాలర్లు షాకయ్యారు. ఈ అరుదైన పసిఫిక్ లింగ్‌కాడ్ (The Pacific lingcod) జాతి చేపలు సాధారణంగా ఉత్తర పసిఫిక్ తీరంలోనే కనిపిస్తాయని అక్కడి జాలర్లు చెబుతున్నారు. ఈ చేపల దంతాలు వేగంగా పెరుగుతాయని, ఇదే సమయంలో వేగంగా ఊడిపోతాయని తెలిపారు. ఒక్కోసారి ఒక చేపకు రోజుకు 20 దంతాలు ఊడిపోతాయని చెబుతున్నారు.
మెక్‌డోనాల్డ్స్ మెడకు టాయ్‌లెట్ వివాదం.. పురుషులు, మహిళలు ఒక్క దానిలోనే
పసిఫిక్ లింగ్‌కాడ్ జాతి చేపలు యుక్త వయస్సులో 50 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయట. మరికొన్ని చేపలు 1.5 మీటర్ల పొడవు పెరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. చేప లోపలి భాగంలో సూక్ష్మ దంతాలు ఉన్నాయని, ఇవి రేజర్ వలే పదునుగా ఉన్నాయని వీటిపై అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతున్నారు.
China : మరో 18 ప్రమాదకర వైరస్‌లు -చైనా మాంసం మార్కెట్లలో గుర్తించిన సైంటిస్టులు
ఇలాంటి దంతాలు ఉండే చేపల నోరు చిన్న దంత స్టాలక్టైట్‌లతో నిండి ఉంటుంది. వీటికి రెండు జతల దవడలు ఉంటాయి. వీటిని ఫారింజియల్ దవడలు (pharyngeal jaws) అని కూడా అంటారు. ఈ వింతైన చేప దంతాలపై యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని జీవశాస్త్రం విభాగంలో డాక్టరల్ రీసెర్చర్స్ కార్లీ కోహెన్, ఎమిలీ కార్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించారు. ఈ చేపలకు ఎన్ని దంతాలు ఉన్నాయి? ఎన్ని దంతాలు పోగొట్టుకున్నాయి? వంటి వివరాలను లెక్కించేందుకు ఈ అధ్యయనం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రయోగశాలలో ఈ అధ్యయనానికి వేదికైంది.
* మైక్రోస్కోప్ సహాయంతో దంతాల గుర్తింపు..
పసిఫిక్ సముద్రం ఒడ్డున దొరికిన చేప దంతాలు మైక్రోస్కోపిక్ పరిమాణంలో ఉన్నందున, వాటిని గుర్తించడం కష్టంగా మారిందని పరిశోధకులు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు బయటపడ్డ దంతాలు ఎరుపు రంగులో ఉన్నాయని గుర్తించారు. చేపల పళ్లపై మరకలను తుడిచేందుకు ఫ్లోరోసెంట్ గ్రీన్ డైని ఉపయోగించినట్లు చెప్పుకొచ్చారు. రిసెర్చర్ కార్లీ కోహెన్ మాట్లాడుతూ, "పసిఫిక్ తీరంలో బయటపడ్డ వింతైన చేపలోని దంతాలను గుర్తించేందుకు మైక్రోస్కోప్ ఉపయోగించాం. ఆ దంతాలు అతి సూక్ష్మంగా ఉండటంతో ఒక డార్క్ రూమ్‌లో కూర్చొని మైక్రోస్కోప్ సహాయంతో వాటిని లెక్కించాం.” అని చెప్పారు.
టిప్పు సుల్తాన్ సింహాసనపు బంగారు తలను వేలానికి పెట్టిన ఇంగ్లాండ్.. ధర ఎంతో తెలిస్తే..షాకవుతారు
ఈ చేపలకు ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్ల వాటి దంతాల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకున్నాయా అనే విషయంపై కూడా అధ్యయనం నిర్వహించారు. అయితే చేపలకు ఆహారం ఇవ్వడం వల్ల దంతాల మార్పిడిలో పెరుగుదల కనిపించలేదని వారి అధ్యయనం ద్వారా తేల్చి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fish, Pacific Ocean