21 దేశాలు.. 21 గంటలు.. 21 సంఘాలు.. ఉగాది సందర్భంగా TANA మహా కవి సమ్మేళనం..

TANA-PSV--Ugadi-flyer

తాజాగా తానా(TANA) కూడా ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “తెలుగు మహాకవి సమ్మేళనం-21" అనే కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.

 • Share this:
  ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల కోసం దేశాలు దాటినా, మాతృభాషపై మమకారాన్ని మాత్రం ప్రవాసులు వదులుకోవడం లేదు. తెలుగు నేల అందించిన సాహిత్య విలువలకు పట్టం కడుతూ, తెలుగు భాష ఉన్నతికి నిరంతంరం కృషి చేస్తూనే ఉన్నారు. తెలుగు భాషను తమ పిల్లలకు నేర్పించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భాషావేత్తలతో వివిధ సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా తానా(TANA) కూడా ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “తెలుగు మహాకవి సమ్మేళనం-21" అనే కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సాహిత్య వేదిక సమన్వయకర్త, శత శతక కవి, చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ ప్రకటించారు.

  తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాలలోని 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం కవితాగానంతో, విశిష్ట అతిధుల సందేశాలతో, అంతర్జాల దృశ్య సాహిత్య సమావేశం నిర్విరామంగా 21 గంటల పాటు సాగుతుందని తెలియజేశారు. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించటం, ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఒకే గొంతుగా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఇంతటి బృహత్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ తెలియజేశారు.
  ఇది కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ తీసుకునే నెల జీతం ఎంతో తెలుసా..? ఏ సీఎంకు ఎక్కువ జీతమంటే..

  ఏప్రిల్ 10, 11 తారీఖుల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తానా ప్రపంచ సాహిత్య వేదిక తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే వారి వివరాలు, ఆయా ప్రముఖుల గురించిన సమాచారాన్ని అతి త్వరలోనే తెలియజేస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతీయేటా ఉగాదికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిచేందుకు తానా ముందుంటుంది. ఈ క్రమంలోనే రాబోయే ఈ కార్యక్రమం కోసం తెలుగు భాషాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
  ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!

  Prapancha MahaKavi Sammelanam, 2021 Ugadi, TANA Prapancha Sahithya Vedika, 21 దేశాలు, 21 గంటలు, 21 సంఘాలు, ఉగాది, తానా, మహా కవి సమ్మేళనం
  TANA-PSV---Ugadi-flyer
  Published by:Hasaan Kandula
  First published: