ఆస్ట్రేలియాలో భర్త.. నెలల బిడ్డతో సహా భారత్ నుంచి బయలుదేరిన భార్య.. కొద్దిగంటల్లో చేరుకుంటుందనగా ఘోరం..

ప్రతీకాత్మక చిత్రం

భారత్ లో ఉన్న భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆస్ట్రేలియాలో ఉన్న భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. అక్కడ ఉన్న సన్నిహితులను ఫ్లాట్ కు పంపించి చూడగా జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఆస్ట్రేలియాలోని ఓ తెలుగు వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించాడు. కొద్ది నెలలుగా ఒంటరిగానే ఇంట్లో ఉంటున్న ఆయన శనివారం మృతిచెందాడు. భారత్ లో ఉన్న భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. అక్కడ ఉన్న సన్నిహితులను ఫ్లాట్ కు పంపించి చూడగా జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్ బాబు ఆస్ట్రేలియాలోని అడిలైట్ రాష్ట్రంలో ఉన్నతోద్యోగం చేస్తున్నాడు. ఆరేళ్లుగా అతడు అక్కడే ఉంటున్నాడు. అయితే ప్రసవం కోసం అతడి భార్య ఏడాది క్రితం భారత్ లోని తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత కరోనా కారణంగా తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయింది.

  అప్పుడే పుట్టిన బిడ్డతో కరోనా కాలంలో విమాన ప్రయాణాలు శ్రేయష్కరం కాదని పెద్దలు చెప్పడంతో ఆగిపోయింది. వీడియో కాల్స్ లోనే తన బిడ్డను హరీశ్ చూసుకునేవాడు. రోజుకు ఒక్కసారయినా ఫోన్ చేసేవాడు. పరిస్థితులు చక్కపడటంతోపాటు, ఆస్ట్రేలియా రాకపోకలకు కూడా అక్కడి ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దీంతో భార్య కూడా తన బిడ్డతో సహా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్దమయింది. శనివారం ఆస్ట్రేలియాకు తన బిడ్డతో సహా బయలుదేరింది. చెన్నైకి చేరుకున్న ఆమె విమానాశ్రయంలో ఉండే తన భర్తకు ఫోన్ చేసింది. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా భర్త స్పందించలేదు.
  ఇది కూడా చదవండి: ఓ ప్రేమ జంట రియల్ క్రైమ్ స్టోరీ.. టాలీవుడ్ లో కలకలం రేపిన కిడ్నాప్.. 6గంటల్లోనే చేధించిన పోలీసులు..

  దీంతో ఆమె కంగారుపడింది. ఆ ప్రాంతంలో ఉన్న సన్నిహితులకు ఫోన్ చేసింది. విషయం చెప్పింది. దీంతో వాళ్లు హరీశ్ ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లి చూశారు. హరీశ్ నిర్జీవంగా ఆ ఇంట్లో కనిపించాడు. దీంతో అదే విషయాన్ని వాళ్లు ఆమెకు చెప్పారు. తన భర్త మరణించాడని తెలిసి ఆమె కుప్పకూలిపోయింది. కొద్ది గంటల్లో భర్త వద్దకు వెళ్తానని, పుట్టిన బిడ్డను ఆయన చేతుల్లో పెట్టాలని కలలు కన్న ఆమె ఆశలన్నీ కల్లలైపోయాయి. అయితే ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్న హరీశ్ ఎలా చనిపోయాడన్నది మిస్టరీగా మారింది. ఆస్ట్రేలియాలో ఉన్న సన్నిహితులే అతడి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి భద్రపరిచారు. తన భర్త మృతదేహాన్ని త్వరగా భారత్ కు తెప్పించాలంటూ ఆమె బోరున విలపిస్తుండటం అందరినీ కలచివేసింది.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని ఓ యువతిపై అమెరికా నుంచి తెలుగు టెకీ ఫిర్యాదు.. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులకే..
  Published by:Hasaan Kandula
  First published: