హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Videos : అమెరికాలో 11 టోర్నడోల బీభత్సం.. 26 మంది మృతి.. 3 రాష్ట్రాల్లో కల్లోలం

Videos : అమెరికాలో 11 టోర్నడోల బీభత్సం.. 26 మంది మృతి.. 3 రాష్ట్రాల్లో కల్లోలం

టోర్నడో బీభత్సం (image credit - twitter - ANI)

టోర్నడో బీభత్సం (image credit - twitter - ANI)

Videos : అమెరికాలో టోర్నడోలు అల్లకల్లోలం సృష్టించాయి. రాకాసి గాలులు.. తమకు అడ్డొచ్చిన ప్రతి దాన్నీ సర్వనాశనం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అమెరికాలో టోర్నడోలు కామన్. ఆర్కిటిక్ మహా సముద్రం నుంచి ఈ సుడిగాలులు తరచూ అమెరికా భూ భాగంపైకి వస్తూనే ఉంటాయి. తాజాగా మిసిసిపీ రాష్ట్రంపై భారీ టోర్నడో విరుచుకుపడింది. ఫలితంగా 26 మంది చనిపోగా... డజన్ల మంది గాయాలపాలయ్యారు. కొంతమంది మిస్సింగ్ అయ్యారు.

మిసిసిపీతోపాటూ.. అలబామా, టెన్నెస్సీ రాష్ట్రంలో కూడా టోర్నడోలు విరుచుకుపడ్డాయి. ఫలితంగా వేల ఇళ్లు సర్వనాశనం అయ్యాయి. 83 వేల ఇళ్లు, ఆఫీసులకు కరెంటు సప్లై ఆగిపోయింది. చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. ఎక్కడ చూసినా అల్లకల్లోల దృశ్యాలే కనిపిస్తున్నాయి.

మిసిసిపీ, అలబామాలో 24 గంటల్లో 11 టోర్నడోలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎప్పుడూ వచ్చే వాటి కంటే ఈసారి వచ్చిన సుడిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందనీ.. అందువల్ల నష్టం కూడా ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన వారికి ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉండే వారిపై టోర్నడోల ప్రభావం కనిపించింది. మిసిసిపీ... షార్కీ కౌంటీలోని సిల్వర్ సిటీ, జాక్సన్‌, రోలింగ్ ఫోర్క్‌తోపాటూ... కరోల్, వినోనా, హంఫ్రీస్ కౌంటీలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి.

అగ్ని మాపక సిబ్బంది, అంబులెన్సులు నిరంతరం పనిచేస్తున్నాయి. రోడ్లపై అడ్డదిడ్డంగా పడివున్న వాహనాలు, చెట్లు కరెంటు స్తంభాలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరిన్ని టోర్నడోలు రావచ్చనే అంచనా ఉంది.

ఈ టోర్నడోలకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది స్థానికులు తమ ప్రాంతం ఎలా అయిపోయిందో వీడియో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నెటిజన్లు వారికి సంఘీభావం తెలుపుతున్నారు.

First published:

Tags: America

ఉత్తమ కథలు