పసిఫిక్ మహా సముద్రానికి దక్షిణంగా ఉండే.. సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3 గా నమోదైంది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పక్కనే ఉన్న పాపువా న్యూ గినియాకి కూడా అలర్ట్ జారీ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
ఇప్పటికే ఇండొనేసియాలో 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపై వల్ల 162 మంది చనిపోగా.. మరో 600 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చాలా ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారికి ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ అందుతోంది. ప్రస్తుతం వెస్ట్ జావా లో భూకంపం వచ్చిన సియాంజుర్ పట్టణంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కూలిన భవనాలతో ఆ ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో భూకంపం రావడం వల్ల.. మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగే ప్రమాదం ఉందంటూ అధికారులు స్థానికుల్ని అప్రమత్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earthquake